Friday, March 13, 2009

66. నేతలంతా ముందే చేతులెత్తేసారు

[మహాకూటమి, తృతీయ కూటమి నేతలంతా చేతులెత్తి పట్టుకొని ఫోటోలకి ఫోజులిస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, నాకో డౌటు! మహాకూటమి, తృతీయ కూటమి అంటూ ఈ రాజకీయనాయకులంతా వేదిక మీద వరుసగా నిలబడి చేతులెత్తుతారెందుకు?

సుబ్బారావు:
చేతులెత్తేయటం అంటే ’నేను ఏం చెయ్యలేను’ అన్న అర్ధంలో ఉపయోగిస్తారని పెద్దలంటారు! అంటే ఈనాయకులంతా ముందే చెప్పేస్తున్నారన్న మాట, ప్రజలకి, ఎన్నికల తర్వాత ప్రజలకోసం తామేమీ చేయలేమని.

సుబ్బలష్షిమి:
అయితే రాజకీయనాయకులంతా నిజమే చెబుతున్నట్లు కదా బావా? మరి పాపం, అన్యాయంగా, వాళ్ళు చెప్పేదంతా అబద్దాలే అంటారేమిటి అందరూ?

*************

1 comment:

  1. అతుకులబొంతల నాయకులు స్టేజీమీద కలసినపుడల్లా ఇలా చేతులు పైకెత్తినప్పుడల్లా నాకుకూడా ఇదే ఆలొచన మెదలుతూఉంటుంది.

    ReplyDelete