Friday, March 20, 2009

72. స్లమ్ డాగ్ మిలియనీర్ – టెంట్ సిటీ బిలియనీర్

[అమెరికాలో ’టెంట్ సిటి’లు వెలుస్తున్నాయన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా లాంటి దేశాల్లో, ఆర్ధిక మాంద్యం రీత్యా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు నదీతీరాల్లో టెంట్లు వేసుకొని ఉంటున్నారట. స్వచ్చంద సంస్థలు ఆహారపదార్ధాలు అందించటానికి వస్తే ఎగబడుతున్నారట. నిజమేనా బావా?

సుబ్బారావు:
ఆకలి ఎవరికైనా ఒకటే కదా మరదలా! అలా గుడారాలు వేసుకున్న ప్రాంతాల్ని ’టెంట్ సిటీ’లని పిలుస్తున్నారట. నేను వార్తల్లో చదివాను.

సుబ్బలష్షిమి:
మనదేశంలో అయితే స్లమ్ ఏరియాలంటారు, వాళ్ళ దేశాల్లో అయితే టెంట్ సిటీలంటారన్నమాట. అయితే ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ లాంటి సినిమాలు తీయడానికి ఇండియా రానక్కర్లేదు. టెంట్ సిటీ బిలియనీర్ లంటూ – అక్కడే సినిమాలు తీసుకోవచ్చు. కదా బావా?

****************

3 comments:

  1. స్లమ్ డాగ్ మిలియనీర్ – టెంట్ సిటీ బిలియనీర్ - బాగుంది

    ReplyDelete
  2. "టెంట్ సిటీ బిలియనీర్" అనడం కన్నా, "టెంట్ పిగ్ బిలియనీర్" అంటే కరెక్టుగా సరిపోతుంది. :)

    ReplyDelete
  3. mmmmm vaala badhalu manaki tapaakaayala laaga kanabadutunnayi annamata.........very bad........

    ReplyDelete