Monday, March 16, 2009

68. ఆశ బోతుతనమా లేక ఆత్మగౌరవం లేకపోవడమా?

[టమాటాలకు ధరపలకక ఊరికే పంచిన రైతుల వార్తనేపధ్యంలో ]



సుబ్బలష్షిమి:
ఈవార్త చూశావా బావా! కిలో 35 పైసల కంటే ధర పలకలేదని రైతులు ఉచితంగా టమోటాలు పంచిపెట్టారట. జనం చూడు బకెట్లు, పెద్దపెద్దగోతాలూ తెచ్చుకొని తీసికెళ్ళుతున్నారు!

సుబ్బారావు:
ఇలా చూస్తే రైతుని దోచుకోవడానికి రాజకీయనాయకులూ, కార్పోరేట్ విత్తనాలు, ఎరువుల కంపెనీలు, దళారీలే కాదు, జనాలు కూడా రెడీగానే ఉన్నట్లున్నారు మరదలా! మార్కెట్లో 40 రూపాయలు పోసి టమోటాలు కొన్న రోజులున్నాయి. ఇప్పుడు మార్కెట్లో 3 నుండి 4 రూపాయలు పలుకుతున్నాయి. కనీసం అందులో సగం రేటన్నా రైతులకిచ్చి టమాటాలు బకెట్ల కొద్దీ గాకపోతే గంపల కొద్దీ తీసుకోవచ్చు గదా! రైతుకేమైనా టమాటాలు పెట్టుబడి పెట్టకుండా, శ్రమపడకుండా ఊరికే వచ్చాయా? ఒకప్పుడు ఊరికే ఇస్తే తీసుకోవటం అంటే నామోషీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని ’ఉచితం’ అన్నది అలవాటైపోయినట్లుంది.

సుబ్బలష్షిమి:
అవును బావా! మినీ లారీల్లో, ఆటోల్లో తెచ్చిన ఖర్చు కూడా రాకుండా రైతుల్ని దళారిలే దోచుకుంటున్నారనుకున్నాను ఇప్పటి దాకా! చూస్తే ఎవరూ తక్కువ తినలేదనిపిస్తుంది. జనాల్లో ఉన్నది ఆశబోతుతనమా, ఆత్మ గౌరవం లేకపోవటమా?

***********

3 comments:

  1. Yes, Peoples Needs To Be Changed.

    ReplyDelete
  2. CMలు అలవాటు చేసారండి,ఏమి చేద్దాం?

    ReplyDelete
  3. ఒక చిన్న విన్నపం. వీలైతే ముఖచిత్రం డాట్ కాం ద్వారా బ్లాగ్ చేయండి. ముఖచిత్రం తెలుగు వారికోసం design చేయబడిన సొషియల్ నెట్ వర్క్. ఏవైనా సందేహాలువుంటే ముఖచిత్రం డాట్ కాం లోని కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా సంప్రదించండి.

    ReplyDelete