Tuesday, March 16, 2010

రామోజీరావు గురించి చర్చించాలంటే, అతణ్ణి ఎంపీని చెయ్యాలా?

[1996 లో పురాతన దేవతా విగ్రహాలను విదేశాలకు తరలిస్తూ రామోజీరావు పట్టుబడినా, 14 ఏళ్ళ గడిచి, ఆరుప్రభుత్వాలు నడిచినా ఇంతవరకూ అతడి మీద చర్య తీసుకోలేదేమని ఉండవల్లి అరుణ్ కుమార్ లోకసభలో లేవనెత్తిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు రామోజీరావు 1996 లో పురాతన విగ్రహాలని విదేశాలకి తరలిస్తూ పట్టుబడ్డాడట. చర్యతీసుకోలేదేమని అడిగితే ఇతడెవరో తథాగత శతపతి అట, సభలో లేని వాళ్ల గురించి చర్చించకూడదన్నాడట. నాకు తెలియకడుగుతాను, నేరగాళ్ళ గురించి సభలో చర్చించ కూడదా బావా? అలా చర్చించాలంటే సదరు నేరగాళ్ళు సభలో ఉండాలా?

సుబ్బారావు:
అదే నాకూ వింతగా ఉంది మరదలా! ఈ లెక్కన కసబ్ ల గురించీ, అఫ్జల్ గురుల గురించీ కూడా సభలో చర్చించకూడదేమో! లేదా వాళ్ల గురించి చర్చించాలంటే వాళ్ళనీ ఎంపీలుగా ఎన్నుకొని పార్లమెంటుకు పంపించాలేమో!

సుబ్బలష్షిమి:
అయితే రామోజీరావు గురించి చర్చించాలంటే రామోజీరావుని కూడా ఎంపీని చేసేయ్యలంటావా బావా? అయినా సభల్లో ఉన్న అత్యధికులు నేర చరితులే కదా!

3 comments:

  1. సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా

    హం బుల్ బులే హై ఇస్‌కీ యే గుల్ సితా హమారా,హమారా.

    పర్ బత్ వో సబ్‌సే ఊంచా హంసాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వో పాస్ వా హమారా,హమారా.

    గోదీమె ఖేల్ తీ హై ఇస్‌కీ హజారో నదియా గుల్షన్ హై జిన్ కీ దమ్ సే రష్‌కే జనా హమారా, హమారా.

    ఆయె అబ్ రౌద్ గంగా ఓ దిన్ హె యాద్ తుజ్ కో ఉతారా తేరె కినారే జబ్ కారవా హమారా మజ్ హబ్ నహీ సిఖాతా ఆపస్‌మే బైర్ రఖనా హింధీ హై హం(3) వతన్ హై హిందూ సితా హమారా,హమారా.

    యూనాన్ ఓ మిస్ర్ ఓ రోమా సబ్ మిత్ గయే జహా సే అబ్ తక్ మగర్ హై బాకీ నామ్ ఓ నిషాన్ హమారా

    కుచ్ బాత్ హై కె హస్తి మిఠాతీ నహీ హమారా సదియో రహా హై దుష్మన్ దౌర్ ఏ జమాన్ హమారా

    ఇక్బాల్ కో ఐ మెహ్రామ్ అప్నా నహీ జహా మే మాలూమ్ క్యా కిసీ కో దర్ద్ ఏ నిహా హమారా

    సారే జహాసె అచ్చా...

    * అర్ధం:

    Better than the entire world, is our Hindustan; we are its nightingales of mirth, and it is our garden abode

    Though in foreign lands we may reside, with our homeland our hearts abide, Regard us also to be there, where exist our hearts

    That mountain most high, neighbor to the skies; it is our sentinel; it is our protector

    In the lap of whose, play thousands of rivers; gardens they sustain; the envy-of-the-heavens of ours

    O waters of the Ganga mighty, do you recall the day when on your banks, did land the caravan of ours

    Religion does not teach us to harbour grudges between us Indians we all are; India, our motherland

    While Greece, Egypt , Rome have all been wiped out till now yet remains, this civilization of ours {it has stood the test of time}

    Something there is that keeps us,our entity from being eroded For ages has been our enemy, the way of the world

    Iqbal! Is there no soul that could understand the pain in thy heart?
    "విశాల విశ్వంలో నా భారత దేశం ఉన్నతం" అంటూ ఈపాట తెలుగులో ఆకాశవాణిలో ప్రసారమయిందట.ఎవరన్నా ఆపాట తెలుపగలరు.

    ReplyDelete
  2. ఉండవల్లి అరున్ కుమార్ ప్రవర్తన కొంత అనుమానాస్పదంగానూ మరికొంత వింతగానూ ఉంది ఎందుకంటే అతను సోనియాకు నమ్మిన బంటు At the same time రాజసేఖర్ రెడ్డికి కూడా నమ్మిన బంటు ,కానీ రజసెఖర్ రెడ్డికీ రామోజీకి పడదు. సోనియా రామోజిరావుకి నమ్మిన బంటు మరి అలాంటప్పుడు అతను రామోజీరావుని అతను బయటకు లాగకూడదు కానీ అతను రామోజీరావుని బయట పెడతానంటున్నాడు కానీ బయట పెట్టడు . ఇదేం లాజిక్కో అర్ధం కావడం లేదు . ఇంకో విషయం అరున్ కుమార్కి రామోజీ మీద పీకల దాకా కోపం (ఎందుకో తెలీదు ) అందుకే అతను రామోజీకి వ్యతిరేకంగా సినిమాలు నిర్మిస్తుంటాడు . 10 ఏళ్ళ క్రితం సురేష్ గోపి నటించిన జర్నలిస్ట్(మళయాలం ) అనే సినిమాను తెలుగులోకి అనువదించాడు . ఇందులో రామోజీ రావుని పోలిన పాత్ర వుంది. ఆ తరువాత కూడా అతను అలాంటి ఇంకో సినిమా ( మోహన్ లాల్ ) మళయాలం నుండి తెలుగులోకి డబ్ చేసాడు. మార్గదర్శి వ్యవహారం బయటపెడతానంటున్నాడు కానీ పెట్టడూ ఏంటో అర్ధం కాకుండా ఉంది . మీరు దీన్ని విశ్లేషిస్తారని ఆసిస్తున్నాను. ఇక పోతే ఈ ఈ పురాతన విగ్రహాల గొడవ 1996 నుండి సాగుతోంది కానీ తేలడం లేదు అప్పట్లో ఈ విషయాన్ని '"వార్త" దినపత్రికలో రెగ్యులర్గా వచ్చేది . ఈ కేసు నాంపల్లి కోర్టులో కూడా నలిగింది చివరికి రామోజీని నిర్దోషిగా తేల్చినట్టు గుర్తు . ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సోనియా అల్లుడిదీ కూడా ఇదే( పురాతన వస్తువులను విదేసాలకు ఎగుమతి చెయడం ) వ్యాపారం . అంతా గందరగోలంగా వుంది

    ReplyDelete
  3. మొత్తానికి దొంగలు దొంగలు కలిసి వూళ్ళు పంచుకొంటారు.మనం ఇలా బ్లాగులు రాసుకొంటూ వుంటాం.

    ReplyDelete