[మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ముఖ్యమంత్రి రోశయ్య రోజు రోజుకీ బలోపేతుడై పోతున్నాడనీ, జానెడు మూరెడు కాదు బారెడు పెరిగిపోయాడని కొంత హడావుడి చేసాడన్న వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! జేసీ దివాకర్ రెడ్డేమిటి, ముఖ్యమంత్రి రోశయ్య గురించి జానా బెత్తెల దర్జీ కొలతలు చెబుతున్నాడు?
సుబ్బారావు:
ఈ మాజీ దేవాదాయ శాఖామంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగి మరదలా! ఏదో కాస్త సోపు వేస్తే మంత్రి వర్గ విస్తరణలో బెర్తు దక్కకపోతుందా అని తంటాలు పడుతున్నాడు.
సుబ్బలష్షిమి:
బావా! జేసీ దివాకర్ రెడ్డికి, జేసీ కాకాసుర రెడ్డి అని పేరు పెట్టుంటే ఇంకా బాగుండేదేమో కదా?
Saturday, March 27, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రజా బలం ఏమీ లేకుండా కేవలం కాకా పట్టి ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళ లిస్టు కాంగ్రెస్ పార్టీలో చేంతాడంత ఉంది.కాబట్టి జేసీ ఈ పద్దతిలో పోవడం లో వింతేమీ లేదు.
ReplyDelete