Thursday, March 4, 2010

ఇప్పుడు ఓడలు బండ్లయి పోయినట్లున్నాయి

[చిన్ననటులని, చిన్న నిర్మాతలని, పెద్ద నిర్మాతలు వేధిస్తున్నారంటూ... రామోజీరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజులపై, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించిన సినీనటుడు రాజా, నిర్మాత కళ్యాణ్ కొల్లి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సినిమా హీరో రాజా, మరో చిన్న సినిమాల నిర్మాత, తమని సినీరంగంలో పెద్దలు తొక్కేస్తున్నారంటూ, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అది తమ పరిధిలోకి వస్తుందో రాదో చూసి స్పందిస్తామని సుభాషణ్ రెడ్డి చెప్పాడట. తెలుసా?

సుబ్బారావు:
ఆ చిన్న కళాకారులూ, నిర్మాతలూ.... రామోజీరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజ్ వంటి నిర్మాతలని ఆరోపిస్తున్నారు మరదలా! అందునా రామోజీరావుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే మానవహక్కుల కమీషన్ కేసు తీసుకుంటుందేమిటి?

సుబ్బలష్షిమి:
రామోజీరావు దాకా ఎందుకు బావా! తెలంగాణా ఐకాస కన్వీనరు కోదండ రాం నే ఏమీ అన్లేక పోతుంటే! ఒకప్పుడు మానవహక్కుల సంఘాలు కేంద్రప్రభుత్వాలనే కట్టడి చేశాయి గానీ.... పాపం, ఇప్పుడు ఓడలు బండ్లయి పోయినట్లున్నాయి.

1 comment:

  1. ’ఆ నలుగురు’ తో పెట్టుకోమాక రాజా. ఎందుకొచ్చిన గొడవ. ఏదో ఒక campలో చేరటం మంచిది. నాగచైతన్య కన్నా నీవు మంచినటుడివే కాని ఏంలాభం. ఏం మాయ చేయలేవే?

    ReplyDelete