[టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వరుడు పాకిస్తాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ఇన్ని కోట్ల మంది భారతీయ యువకుల్లో సానియా మీర్జాకి వరుడే దొరకలేదు కాబోలు; పాక్ క్రికెటర్ ని పెళ్ళాడుతోంది. ఇక భవిష్యత్తులో ఇండో - పాక్ ల మధ్య శాంతి సుహృద్బావాలకి బ్రాండ్ అంబాసిడర్ గా అవతరించ నుందేమో!
సుబ్బారావు:
అలాంటి అభివృద్ది కోసమే కదా మరదలా ఇంత విశ్వమానవ ప్రేమని చాటుకునేది? అసలే ఆడపిల్ల.... పుట్టింటికీ, అత్తింటికీ మధ్య వారధి కదా! ఇక చూస్కో! పాతబస్తీ నుండి పాకిస్తాన్ దాకా నిరంతర కొరియర్ స్రవంతి!
సుబ్బలష్షిమి:
ఇలాంటి పరస్పర ప్రయోజనాలుంటాయి కాబట్టే నేమో బావా, ఆమె ఆటలో గెలిచినా ఓడినా మీడియా ఇమేజ్ కి మాత్రం ఢోకా ఉండదు. అయినా వివాహసంబంధాలు, వివాహేతర సంబంధాలు కెరీర్ గ్రాఫ్ కు సోపానాలై చాలాకాలమయిందిలే బావా!
Subscribe to:
Post Comments (Atom)
ఇంకా ఏడవలెదెంటా అనుకుంటాఉన్నా.... ఎవరు ఏవరిని పెళ్ళి చెసుకుంటె మికెందుకు.
ReplyDeleteమారదు మారదు మనుషులతత్వం
ReplyDeleteమారదు
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు
భ్రమపడకూడదు [[మారదు]]
సూర్య చంద్రులూ మారలేదులే
చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం
మారటమంటే సుళువుకాదులే
[[మారదు]]
పైసా ఉంటే అందరుమాకు
బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో
అంటారు చెవులకు చేటలు కడతారు
[[మారదు]]
కాసుపడనిదే తాళి కట్టరు
పెళ్ళిపీటపై వారు కాలు
పెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ
చదువుకున్నవారే కలలుకందురూ
[[మారదు]]
ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో
కాపాడేవాడే
బంధువూ అతడే బంధువూ
ఆత్మబంధువూ
సానియా కుటుంబం, ఇరాన్ నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డదన్న వార్త ఎంత వరకు నిజం? ఎవరికయినా వీటి గురించిన వివరాలు తెలిస్తే తెలియజేయగలరు.
ReplyDeleteఓ అజ్ఞాతా! ఎవరో ఏదో వ్రాసుకుంటే వచ్చి మరీ కామెంట్ వ్రాసావు చూడు, అదే ఇదీ!
ReplyDeleteNrahamthulla గారు, నా టపాకాయకి, మీ కామెంట్ కి పొంతన ఏమిటో తెలియలేదండి!
ReplyDelete