Wednesday, March 31, 2010

వివాహ సంబంధాలు, వివాహేతర సంబంధాలు కెరీర్ గ్రాఫ్ కు సోపానాలు

[టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వరుడు పాకిస్తాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇన్ని కోట్ల మంది భారతీయ యువకుల్లో సానియా మీర్జాకి వరుడే దొరకలేదు కాబోలు; పాక్ క్రికెటర్ ని పెళ్ళాడుతోంది. ఇక భవిష్యత్తులో ఇండో - పాక్ ల మధ్య శాంతి సుహృద్బావాలకి బ్రాండ్ అంబాసిడర్ గా అవతరించ నుందేమో!

సుబ్బారావు:
అలాంటి అభివృద్ది కోసమే కదా మరదలా ఇంత విశ్వమానవ ప్రేమని చాటుకునేది? అసలే ఆడపిల్ల.... పుట్టింటికీ, అత్తింటికీ మధ్య వారధి కదా! ఇక చూస్కో! పాతబస్తీ నుండి పాకిస్తాన్ దాకా నిరంతర కొరియర్ స్రవంతి!

సుబ్బలష్షిమి:
ఇలాంటి పరస్పర ప్రయోజనాలుంటాయి కాబట్టే నేమో బావా, ఆమె ఆటలో గెలిచినా ఓడినా మీడియా ఇమేజ్ కి మాత్రం ఢోకా ఉండదు. అయినా వివాహసంబంధాలు, వివాహేతర సంబంధాలు కెరీర్ గ్రాఫ్ కు సోపానాలై చాలాకాలమయిందిలే బావా!

5 comments:

  1. ఇంకా ఏడవలెదెంటా అనుకుంటాఉన్నా.... ఎవరు ఏవరిని పెళ్ళి చెసుకుంటె మికెందుకు.

    ReplyDelete
  2. మారదు మారదు మనుషులతత్వం
    మారదు
    మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు
    భ్రమపడకూడదు [[మారదు]]

    సూర్య చంద్రులూ మారలేదులే
    చుక్కలు మొలవకా మానలేదులే
    మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం
    మారటమంటే సుళువుకాదులే
    [[మారదు]]

    పైసా ఉంటే అందరుమాకు
    బంధువులంటారు
    పైసాపోతే కన్నబిడ్డలే చీపో
    అంటారు చెవులకు చేటలు కడతారు
    [[మారదు]]

    కాసుపడనిదే తాళి కట్టరు
    పెళ్ళిపీటపై వారు కాలు
    పెట్టరు
    కట్నములేనిదే ఘనతే లేదనీ
    చదువుకున్నవారే కలలుకందురూ
    [[మారదు]]

    ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో
    కాపాడేవాడే
    బంధువూ అతడే బంధువూ
    ఆత్మబంధువూ

    ReplyDelete
  3. సానియా కుటుంబం, ఇరాన్ నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డదన్న వార్త ఎంత వరకు నిజం? ఎవరికయినా వీటి గురించిన వివరాలు తెలిస్తే తెలియజేయగలరు.

    ReplyDelete
  4. ఓ అజ్ఞాతా! ఎవరో ఏదో వ్రాసుకుంటే వచ్చి మరీ కామెంట్ వ్రాసావు చూడు, అదే ఇదీ!

    ReplyDelete
  5. Nrahamthulla గారు, నా టపాకాయకి, మీ కామెంట్ కి పొంతన ఏమిటో తెలియలేదండి!

    ReplyDelete