[టెర్రరిజంని ఆరికట్టడానికి ప్రతీ కొత్త వ్యక్తినీ గుర్తింపు పత్రాలతో పరీక్షించాల్సిందిగా దూరదర్శన్ లో ప్రకటనల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! టెర్రరిజంని అరికట్టడానికి అనుమానస్పదవ్యక్తుల గురించీ, వస్తువులు గురించీ పోలీసులకి రిపోర్టు ఇవ్వమనీ ప్రకటనలు ఇస్తున్నారు, బావుంది. కానీ ప్రతీ వ్యక్తినీ గుర్తింపు పత్రాలు చూపనిదే డీల్ చేయవద్దని చెబుతున్నారు. అసలు పాస్ పోర్టు, వీసాలు, ఐడెంటిటీ కార్డులూ చక్కగా నకిలీవి పుచ్చుకొని మరీ వస్తున్నారు కదా టెర్రరిస్టులు? మరి దాన్నెలా ఆపుతారు?
సుబ్బారావు:
హైదరాబాదు పాతబస్తీకి వెళ్తే బొచ్చెడు నకిలీ పాస్ పోర్టులూ, వీసాలూ, విద్యార్ధి గుర్తింపు దగ్గర నుండి ఓటరు గుర్తింపు కార్డుల దాకా దొరుకుతాయని పాకిస్తాన్ లో ఉన్న చిన్నపిల్లలకి కూడా తెలుసు. మన ప్రభుత్వానికి మాత్రం తెలియదు. పాతబస్తీలోనూ, హైదరాబాదులోనూ ఉన్న మూలాలని ఏం చేయరు గానీ, ప్రతి కొత్త వ్యక్తినీ ఇల్లు/షాపు అద్దెకివ్వడానికి గానీ, చివరికి హోటల్ గది అద్దెకిచ్చేటప్పుడూ పత్రాలు పరీక్షించాలట. అక్కడకి అవేవో టెర్రరిస్టులకి అందుబాటులో లేనట్లు.
ఇవ్వన్నీ కావు మరదలా! ముంబైదాడులప్పుడు తాజ్ హోటల్ గదినే ఉగ్రవాదులు కంట్రోల్ రూం లాగా ఉపయోగించుకున్నారు. అక్కడకి మందుగుండు సామాగ్రిని చేరవేసారు. ఇప్పటికి ఆ టాటాలని ఏమాత్రం విచారణలు చేసింది ఈ యూపిఏ ప్రభుత్వం? కాశ్మీర్ నుండి హైదరాబాద్ దాకా MRO అధికారులే ఉగ్రవాదులకి డబ్బులు తీసుకుని మరీ పత్రాలిచ్చారు. ఈ రూల్స్ అన్ని మనలాంటి సామాన్యులని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఉంటాయి, మరదలా!
Subscribe to:
Post Comments (Atom)
Governments harass normal people with these ridiculous rules, but in capable of stopping terrorists to do what they want to do.
ReplyDeleteOn May 3rd in Mumbai, Special Court would announce its verdict on the lone surviving terrorist of 26/11. Lets see what follow up action would be there for the verdict and how our so called human rights activists react to it.