Tuesday, April 6, 2010

సానియా మీర్జా షోయబ్ మాలిక్ ల పెళ్ళికి జడ టపాకాయలు!

సుబ్బలష్షిమి:
బావా! సానియా వరుడు షోయబ్ మాలిక్ పాస్ పోర్టునీ, సెల్ ఫోన్ నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారట తెలుసా?

సుబ్బారావు:
అవును మరదలా! ఒకప్పటి తెలుగు సినిమా పాట "ఎరక్కపోయి వచ్చాను - ఇరుక్కుపోయాను" అంటూ పాడుకోవచ్చు, అతడు సానియా ఇంట్లో కూర్చొని!

సుబ్బలష్షిమి:
మరి ఓ వైపు పోలీసులు అతడి పాస్ పోర్టుని సీజ్ చేస్తే, మరోవైపు ’మచ్చ చెరిగే వరకూ దేశం దాటను’ అంటాడేమిటి?

సుబ్బారావు:
మాయాబజార్ లో.... లక్షణ కుమారుడి సారధి వేసి ఉన్న తలుపుల్ని గుద్దుకో బోతాడు. అవి హఠాత్తుగా తెరుచుకుంటాయి. అప్పుడు పొర్లగింతలు పడిన వాడు కాస్తా, శాస్త్రీ శర్మలతో ’పడ్డాననుకున్నారా పిల్లి మొగ్గలు వేసాను’ అంటాడు. ఇదీ అలాంటిదే!

సుబ్బలష్షిమి:
అసలైనా సౌదీ లోని ఓ విమానయాన సంస్థలో ఉన్నతోద్యోగీ, అక్కడ సంపన్నులిచ్చే పార్టీలకి తప్పనిసరిగా హాజరయ్యెంత ప్రముఖ వ్యక్తీ అయిన సిద్దిఖీ కుమార్తె అయేషాతో వివాహ వివాదంలో ఏముంది బావా?

సుబ్బారావు:
ఏముంటుంది మరదలా? బహుశః అప్పట్లో.... అంత పరపతి ఉన్న సిద్దిఖీ కుటుంబంతో సాన్నిహిత్యం కెరీర్ కి పనికి వస్తుందనుకుని ఉంటాడు. ఎక్కి వచ్చిన నిచ్చెనని ఎత్తి అవతల పారేస్తేనే సమాజంలో పైకి రావచ్చనీ, అలాంటి వారికే హవా నడుస్తున్న రోజులనీ అందరూ అంటున్నాదే కదా! సెలబ్రిటీ అయ్యేందుకు అదే పాటించి ఉంటాడు. పెద్ద నిచ్చెన దొరికినప్పుడు చిన్నదాన్ని తోసి పారేయటమే కెరీర్ సోపానం మరి!

సుబ్బలష్షిమి:
మరైతే.... గాయాలతో అసలు టెన్నిస్ ఆటకే దూరంగా ఉన్నా కూడా, సానియా ర్యాంకు మెరుగైందట. ఈ రోజు పత్రికలో వచ్చింది. అదెలా?

సుబ్బారావు:
మరామెది హైదరాబాదు! ఆడినా ఓడినా సానియా రూటే వేరు. మీడియా గారాబు పట్టి కదా! అందునా జాతీయ గీతాన్ని అవమానించి మరీ అంత గారాబాన్ని పొందిదయ్యె!

సుబ్బలష్షిమి:
మొత్తానికీ.... కదిలినా మెదిలినా.... తుమ్మినా దగ్గినా సంచలనం కావటమే సానియాకి అలవాటుగా ఉండింది. ఇప్పడది పెళ్ళికీ వర్తించింది. అవును గానీ బావా! ఈ షోయబ్ మాలిక్, పలుసార్లు హైదరాబాద్ వచ్చి పోయాడట! సిద్దిఖీ ఇచ్చిన పార్టీకి పాక్ క్రికెటర్లూ హాజరయ్యారట. ఆ విషయాలెప్పుడూ బాగా ప్రచారం కాలేదిమిటి బావా?

సుబ్బారావు:
మీడియా చప్పుడు చేస్తేనే అందరికీ తెలిసేది మరదలా! మీడియా గమ్మునుందనుకో! అప్పడిలాంటి యేం ఖర్మ, చాలా విషయాలూ గుట్టుచప్పుడు గాకుండా గప్పుచుప్పున జరిగిపోతాయి.

సుబ్బలష్షిమి:
సానియా - షోయాబ్ - అయేషా ట్రయాంగిల్ లవ్ స్టోరీ సరే! సౌదీ - పాకిస్తాన్ - దుబాయ్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమిటి బావా?

సుబ్బారావు:
దుబాయ్ లో మాఫియా డాన్ లున్నారు. పాకిస్తాన్ ఐఎస్ ఐ ఈ మాఫియాలకి గాడ్ ఫాదర్. ఇక పాకిస్తాన్ లో ఏ ప్రభుత్వాధినేతని దించాలన్నా, వాళ్ళకి ప్రవాస జీవితం గడపటానికి సౌదీ యే పెద్దదిక్కు. లాడెన్ మూలాలు కూడా ఇక్కడే ప్రారంభం. ఈ మాఫియాలని దర్శించుకోవటానికి మన సినీ తారలు,ప్రముఖులు అందరూ షాపింగ్ నెపంతో దుబాయ్ కు వెళ్తారు. ఇదే సౌదీ - పాకిస్తాన్ - దుబాయ్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ!

సుబ్బలష్షిమి:
సానియా బాబాయి సౌదీలో ఉంటాడట. ఇలా సౌదీతోనూ, దుబాయ్ తోనూ సన్నిహిత సంబంధాలున్న హైదరాబాదీయులు గొప్ప వాళ్ళే బావా!

సుబ్బారావు:
అందుకే అలాంటి వాళ్ళతో సంబంధాలు కలుపుకుంటే కెరీర్ బాగుంటుందనే మంత్రం పాటిస్తుంటారు సెలబ్రిటీలుగా ఎదగాలనుకునే వాళ్ళు! ఇప్పుడు చూడకూడదా? పాత బస్తీ రిమోటు పాకిస్తాన్ లో ఉందో, పాకిస్తాన్ రిమోట్ పాతబస్తీలో ఉందో తేలటం లేదు కదా!

సుబ్బలష్షిమి:
చూద్దాం! ఇంకెన్ని మెలికలు తిరుగుతుందో? అవును గాని బావా! మొన్న ఈ విషయం మీద టపాకాయ వేస్తే ఓ ’అజ్ఞాత’.... "ఇంకా ఏడవలేదేమిటా అనుకున్నాను. ఎవరు ఎవరిని చేసుకుంటే మీ కెందుకు" అన్నాడు. ఇప్పుడు సానియా పెళ్ళికూతురు అవుతుందో లేదోనని, తీరిగ్గా ఏడుస్తున్నాడేమో ఆ అజ్ఞాత!

సుబ్బారావు:
మరి చేసుకున్న ఖర్మ ఎక్కడికి పోతుంది మరదలా!

3 comments:

  1. ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని ఖురాన్,హదీసులు ఘోషిస్తున్నా ఈ నిషిద్ధ రంగాలన్నిటిలో లక్షలాది ముస్లిం నిపుణులున్నారు

    ReplyDelete
  2. ఇండియా వరుడి సంగతి అల్లా
    ఎరుగు.పెళ్ళికి ముందే
    వీధుల్లో షికార్లు చేసిన ఒక
    ప్రేమ జంట పెళ్ళికి కూడా
    ముస్లిములెవరూ వెళ్ళొద్దని
    ఫత్వాజారీచేశారట.ప్రేమ,మతం,దేశం,విడాకులులాంటి సమశ్యలను
    నానా కష్టాలూ పడి దాటుకొస్తే
    పాపం మతపెద్దలు కులపెద్దల
    స్థాయికి దిగజారి వారిని
    వెలివేశారు.
    ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్ లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు
    ...లాంటివన్నీ నిషిద్ధమని
    మతపెద్దలు ఎంతగా చెప్పినా
    వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో
    పాతుకుపోయిన లక్షలాది
    ముస్లింలను ఆదరించి
    పెళ్ళిళ్ళు అంత్యక్రియలు
    నట్లుగానే ఈ ఖిలాడీలను కూడా
    ఆదరించాలి.అన్నిరకాల జనాన్ని
    మతం
    కలుపుకుపోకపోతే ఆ మతంలో
    మిగిలేది ఎందరు?

    ReplyDelete