Friday, April 30, 2010

మొత్తానికీ రోబోలకి కూడా హఠాత్తుగా వెన్నెముక వచ్చేస్తుంది!

[శిబూ సోరెన్ ని జుట్టు, గడ్డం మీసాలూ పట్టుకుని తలోదిక్కుకు లాగుతున్నట్లుగా ఈనాడులో[30/4/10] శ్రీధర్ వేసిన కార్టూన్ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జార్ఖండ్ లో ప్రభుత్వం సంక్షోభంలో పడిన సందర్భంగా, శిబూ సోరెన్ ను తలో దిక్కుకు లాగుతున్నట్లుగా కార్టూన్ వేసారు చూశావా? అందులో భాజపా తరుపున గడ్కరీని వేసారు. కాంగ్రెస్ తరుపున అధినేత్రి సోనియా బొమ్మ గాకుండా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని వేసారేమిటి బావా? పార్టీ నిర్ణయాలు అధ్యక్షురాలు గాకుండా ప్రధానమంత్రి ఎప్పటి నుండీ తీసుకుంటున్నాడు?

సుబ్బారావు:
ప్రధానమంత్రికే కాదు, ఎవరికీ అంత సీన్ లేదు మరదలా! పార్టీ అధ్యక్షురాలికి రక్షా కవచం కావాల్సినప్పుడు, ఈ విన్యాసాలన్నీ చోటు చేసుకుంటాయి.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అడ్వాంటేజ్ ఉందన్నప్పుడు అధ్యక్షురాలు చక్రం తిప్పుతుంది. డిజ్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఇలా ఇతరులు తెర మీదికి వస్తారు. మొత్తానికీ రోబోలకి కూడా హఠాత్తుగా వెన్నెముక వచ్చేస్తుంది!

2 comments:

  1. He is doing his best for his country . Question yourself are you doing the same?

    ReplyDelete
  2. >>>He is doing his best for his country .
    అతడు పాకిస్తాన్ లో పుట్టాడు. దాని కోసమే పని చేస్తున్నాడు. మీరన్నది నిజమే!

    ReplyDelete