[మన దేశంలో ప్రతి 5 గురు పురుషుల్లో ముగ్గురు అన్ని వేళల్లో అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని భావిస్తున్నట్లు ఒక సర్వే తేల్చింది. - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! మనకు పట్టణాలలో కంటే గ్రామాలలోనే జనాభా ఎక్కువ కదా? పొలం పనులు చేసే కునే ఆడవారికి గానీ, మగవారికి గానీ తమ అందం కంటే పని ముఖ్యం అనుకునేవాళ్ళే ఎక్కువ. అందం గురించే ఆలోచిస్తే ఎండలో అసలు పనే చేయలేరు కదా? మరి ఈ సర్వే వాళ్ళేంటి బావా! ప్రతి 5 గురు పురుషుల్లో 3గురు అన్ని వేళల్లో అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని భావిస్తున్నట్లు తేల్చారు?
సుబ్బారావు:
అది కాదు మరదలా! అందరూ అందం గురించే ఆలోచిస్తున్నారంటేనే గానీ, ఎవరుకి వారు తము మాత్రమే అందం గురించి ఆలోచించటం లేదనుకోరు. అప్పుడు వాళ్ళు కూడా పని పాట వదిలేసి అందం గురించి ఆలోచిస్తారు. ఇలాగే ఈ కార్పోరేట్ సంస్థలు తమ వ్యాపారాలు పెంచుకోవటానికి సర్వే పేర్లతో జనం నెత్తిన తమ అభిప్రాయాలను రుద్దు తారు.
సుబ్బలష్షిమి:
వెరసి దేశంలో ఆడా మగ తేడా లేకుండా అందం గురించే ఆలోచిస్త్రున్నారన్న మాట.
Sunday, April 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment