Thursday, April 15, 2010

ఇలాంటి చట్టాలు విత్తనాలకే గాక అన్నిటికీ వర్తింపచేస్తే.... అదే ఎమర్జన్సీ!

[>>> 'జీఎం (జెనిటికల్లీ మాడిఫైడ్) ఉత్పత్తులు భద్రం కావంటూ శాస్త్రీయ ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే' జైలుకు పంపిస్తారు.
శాస్త్రీయమైన ఆధారాలు, సాక్ష్యాలు చూపకుండా జీఎం ఉత్పత్తులు సురక్షితం కాదంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తే ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఓ నిబంధన (చాప్టర్ 13 సెక్షన్ 63) పొందుపరిచింది.
ఇందుకు అనుగుణంగా భారత బయో టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు (బీఆర్ఏఐ) - 2009 రూపొందించింది. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
బావా! జెనిటికల్లీ మాడిపైడ్ విత్తనాల గురించి, ఎవరైనా సరే, ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రభుత్వం వాళ్ళపైన కేసులు పెట్టి జైలులో పెడుతుందట, తెలుసా?

సుబ్బారావు:
ఆ విత్తనాలని ప్రభుత్వం బలవంతంగానైనా సరే రైతుల నెత్తిన రుద్దాలనుకుంటుంది మరదలా! దాని మీద ఇంకే వ్యతిరేకతా రాకుండా చూడటానికి ఇలాంటి చట్టాలు తెస్తోంది. దీన్నే మరొకరు చేసి ఉంటే నియంతృత్వం అని విపరీత ప్రచారం చేసి ఉండేది మీడియా!

సుబ్బలష్షిమి:
ఏ విషయం మీదైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే జైలులో పెట్టేటట్లయితే, ముందుగా మీడియా వాళ్ళనే జైలులో పెట్టాలి బావా! మొన్న ఎగ్జెయిల్డ్ వ్యవహారంలో టీవీ -5 వాళ్ళని జైలులొ పెట్టినట్లు! ఏ విషయమైనా... ఆధారాలతోనో, అవి లేకుండానో మీడియా వ్రాస్తేనే కదా ఎవరికైనా తెలిసేది!?

సుబ్బారావు:
ఇలాంటి చట్టాలు విత్తనాలకే గాక అన్నిటికీ వర్తింపచేస్తే.... అదే ఎమర్జన్సీ!

1 comment:

  1. There is a Scientific American editorial last year:
    http://www.scientificamerican.com/article.cfm?id=do-seed-companies-control-gm-crop-research
    with the abstract "Scientists must ask corporations for permission before publishing independent research on genetically modified crops. That restriction must end". So it may be difficult for opponents of GM food to find publihed research. But I think that in India there was independent research, particularly with respect to BT cotton.

    ReplyDelete