[సిక్కిం హైకోర్టుకు దినకరన్ బదిలీ. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఈ నెల 1న ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశించింది. ఇందుకు దిన కరన్ నిరాకరించాడు కూడా! దాంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కొలీజియం దినకరన్ ను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిక్కిం హైకోర్టు రాష్ట్ర బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! నాకు తెలియక అడుగుతాను. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి దినకరన్ ని బదిలీ చేస్తే, అతడు వెళ్ళనని మొరాయించాడు. ఈ సుప్రీం కోర్టుకొలీజియం ఏమీ చేయలేక ఇంకో బదిలీ చేసి ఊరుకుంది. ఈ కోర్టులు, జడ్జీలు ఇక సామాన్య ప్రజానీకానికి ఏపాటి న్యాయం చేస్తారంటావు?
సుబ్బారావు:
అవినీతి బయటపడినా సెలవుపై వెళ్ళటానికి మొరాయించాడంటే సదరు జడ్జి ఎంత ముదురో చూడు! ఇలాంటి ‘కోర్టుల్ని, జడ్జీల్ని నమ్మటం అంటే గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్లే!’
Subscribe to:
Post Comments (Atom)
దిగజారుడు తనం రాజకీయ వ్యవస్థలోనే కాదు న్యాయవ్యవస్థలోనూ కనిపిస్తోంది. న్యాయమూర్తులు కూడా
ReplyDeleteరాజకీయ నాయకుల్లాగే తయారయ్యారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని వేరే కోర్టుకు బదిలీ చేయడం
కూడా తప్పే. ముందు సదరు న్యాయమూర్తిని న్యాయం చెప్పే బాధ్యతల నుంచి తప్పించాలి. దినకరన్ పై వస్తున్న ఆరోపణలలో వాస్తవాలు బయటపడేంత వరకూ అతను న్యాయమూర్తిగా అనర్హుడు