Tuesday, April 20, 2010

సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లోనూ కెమిస్ట్రీ జరిగిపోతోంది !

[బోగస్ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛను కార్డుల ఏరివేత - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్. బ్రతికి ఉండగా అమలు చేసిన పధకాలలో లబ్ధిదారుల కార్డుల్లో అత్యధికం బోగస్ వని ఏరేస్తున్నారట. మరి, గతంలో అన్ని బోగస్ కార్డులున్నాయంటే అంత సొమ్ము ఎవరికి చేరినట్లు బావా!?

సుబ్బారావు:
అది కాదు మరదలా! అన్ని అవకతవకలు చేసిన వై.యస్.ని మీడియా దేవుణ్ణి చేసింది చూడు, అదీ విశేషం. ఇంకా విశేషం ఏమిటంటే - ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, తానూ వై.యస్. మార్గంలోనే వెళ్తున్నాననీ, అవే పథకాలు కొనసాగిస్తాననీ అంటూ ఉన్న, కార్డులన్నింటిని ఊడగొడుతూ ‘ఇది రాక్షస పాలనా?’ అంటున్నాడు.

సుబ్బలష్షిమి:
మరీ, జగన్ మళ్ళీ స్వర్ణ యుగం వస్తుంది అంటాడేమిటి బావా?

సుబ్బారావు:
ఆ! ఏముంది మరదలా! సినిమాలు హిట్ చేసుకోవాడానికి, ఫలానా హీరోకీ ఫలానా హీరోయిన్ కీ మధ్య కెమిస్ట్రీ జరిగిపోతోందని మీడియా గోల చెయ్యదూ? ఇదీ అలాంటిదే! జగన్ కీ, రోశయ్య కీ మధ్య ’ఏదో’ జరిగిపోతోందని పిక్చర్ ఇవ్వడానికి, నానా ఆగచాట్లూ పడుతున్నట్లున్నారు.

సుబ్బలష్షిమి:
అంటే ఇది రాజకీయ కెమిస్ట్రీ అన్నమాట!

1 comment:

  1. AMMA ODI గారూ...,[బోగస్ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛను కార్డుల ఏరివేత - వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! వై.యస్. బ్రతికి ఉండగా అమలు చేసిన పధకాలలో లబ్ధిదారుల కార్డుల్లో అత్యధికం బోగస్ వని ఏరేస్తున్నారట. _____________________భలే రాసారండీ .. సూపరు :)

    ReplyDelete