Saturday, April 17, 2010

ఏది నిజమో తెలియకూడదనే కదా మీడియా రకరకాలుగా ప్రచారించేది!

[కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో కేంద్ర బిందువుగా మారిన సునంద పుష్కర్.. తనపై ఆరోపణలు చేసే వారి మీద పరువు నష్టం దావాలు వేయాలని ఆలోచిస్తున్నారు. ఇందు కోసం దుబాయికి చెందిన ఒక న్యాయవాదిని నియమించుకున్నట్లు సమాచారం. న్యాయ సహకారం కోసం తనను కోరారని «ద్రువీకరిస్తూ అశిష్ మెహతా అనే ఈ న్యాయవాది దుబాయిలో ఒక ప్రకటన విడుదల చేశారు.

తన క్లయింటు పరువుకు నష్టం కలిగించారని ఆయన పేర్కొన్నారు. ఆమె బ్యూటీషియన్ అనీ, ఆమె స్పా (హెల్త్ క్లబ్) వ్యాపారం చేశారని వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనని చెప్పారు. కానీ.. మీడియా ఆమెపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని మండి పడ్డారు. ఆమె దుబాయిలో పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అని ఆయన చెప్పారు. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సునందా పుష్కర్ న్యాయవాది, మీడియా ఆమెపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడ్డాడు. అలాంటప్పుడు ఆమెకు పరువునష్టం కలిగిస్తున్నది మీడియా కదా! మీడియాపై పరువునష్టం దావా వేయకుండా, కేవలం ఆరోపణలు చేసినవారి పైన మాత్రమే దావా వేయలనుకుంటున్నారేమిటి?

సుబ్బారావు:
అంతే కదా మరదలా! మీడియాను అంటే ఇంకేమయిన ఉందా! అప్పుడు మీడియా వాళ్ళు ఆమెపై మండిపడతారు. అంతే కాదు ఈ వ్యవహారం లోగుట్లు బయటకు తీస్తారు మరదలా!

సుబ్బలష్షిమి:
బావా! ఆమె బ్యూటీషియన్ అనీ, ఆమె హెల్త్ కబ్ల్ వ్యాపారం చేస్తుందని మీడియా అంటుంది. ఆమె లాయరేమో, ’కాదు, దుబాయ్ లో ఆమె పారిశ్రామిక వేత్త, వ్యాపార వేత్త’ అంటున్నాడు. ఇవేవి తెలియకుండానే మీడియా, బ్యూటీషియన్, స్పా సెంటర్ నడుపుతుందని ప్రచారం చేసిందా? లేక ఇప్పుడు, పెద్ద గొడవలో ఇరుక్కున్నందున ఆమె పారిశ్ర్రామిక వేత్త, వ్యాపార వేత్త అయిపోయిందా?

సుబ్బారావు:
ఏది నిజమో తెలియకూడదనే కదా మీడియా రకరకాలుగా ప్రచారం చేస్తోంది!

No comments:

Post a Comment