[ఫేస్ బుక్ లో సునందా పుష్కర్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గురించి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! భారత్ లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం లక్షకోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాడట తెలుసా! లక్ష కోట్ల డాలర్లంటే రమారమి యాభై లక్షల కోట్ల రూపాయలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్టే లక్ష కోట్ల రూపాయలు. అంటే ఈ మాఫియా డాన్ క్రికెట్ మీద పెట్టిన పెట్టుబడి యాభై సంవత్సరాలకు సరిపడా మన రాష్ట్ర బడ్జెట్ అన్నమాట. ఎంత భారీ మొత్తం బావా!
సుబ్బారావు:
ఇంత పెట్టుబడి పెట్టాడంటే ఈ మాఫియా డాన్, అతణ్ణి పై ముఖంగా పెట్టి, వెనక నుండి చక్రం తిప్పుతున్న వ్యక్తులకి, భారత్ లో మిగిలిన రంగాల మీద ఎంత పట్టు ఉండాలి మరదలా! కాబట్టే కదా రాజకీయ నాయకులు, సినిమా నటులు, కార్పోరేట్ వ్యాపారులు, విమాన యాన సంస్థల అధిపతులు.... వాళ్ళూ వీళ్ళని లేకుండా బడా వ్యక్తుల చేతులన్నీ ఐపీఎల్ లో తేలుతున్నాయి.
సుబ్బలష్షిమి:
నిజమే బావా! మరో విషయం ఏమిటంటే క్రికెట్ మోజు మీద నడిచే వ్యాపారమే కాక, బెట్టింగు వ్యాపారమూ ఇబ్బడిముబ్బడి అట.
సుబ్బారావు:
అలా ఇబ్బడిముబ్బడి వ్యాపారం చేసుకునేటందుకే కదా మీడియా.... సెలబ్రిటీలనీ, సినిమా నటులనీ కలుపుకుని క్రికెట్ మీద విపరీత మోజుని సృష్టించేది. దేని గురించైనా ప్రజా దృక్పధాన్ని ప్రభావ పరిచేది ఇలాంటి ప్రయోజనాల కోసమే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment