Wednesday, April 7, 2010

చేతగాని వానికి మాటలెక్కువ, చెల్లని రూపాయికి గీతలెక్కువ

[నక్సల్స్, జవానులను హతమార్చటంపై మాట్లాడుతూ ’మా సత్తా చూపుతాం : హోం శాఖ’ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నిన్న నక్సల్స్ , మన వీర జవానులను బాంబులతో పేల్చటం, తుపాకీ కాల్పుల ద్వారా 76 మందిని కాల్చి చంపిన సంఘటన గురించి మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ ’మా సత్తా చూపుతాం’ అని అన్నారు. నిజంగా సత్తా చూపగలగే సత్తా ఉందా బావా?

సుబ్బారావు:
ముంబై ముట్టడి నాడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు మరదలా! ఇప్పటికీ దేశం అవతల ఉన్న పాకిస్తాన్ నే కాదు, దేశం లోపల టాటాలని కూడా ఏమీ చేయలేదు. అంతే గాక కసబ్ లకి బిర్యానిలు పెడుతూ మేపుతున్నారు కూడా!

సుబ్బలష్షిమి:
అందుకే అంటారేమో బావా! చేతగాని వానికి మాట లెక్కువ, చెల్లని రూపాయికి గీతలెక్కువ అని!

1 comment:

  1. అవునండి.
    నక్సలైట్లు , మావోయిస్టు వర్గాలను శాంతి భద్రతల సమస్యగా మాత్రమే భావించి పరిష్కరించుదామనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయనిపిస్తుంది.

    ReplyDelete