Sunday, April 25, 2010

మ్యాచ్ ఫిక్సింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ !

[మ్యాచ్ ఫిక్సింగ్? జాబితాలో భారత ప్రముఖ ఆటగాళ్ళు. ఓ విదేశీ కెప్టెన్ కూడా. 3 జట్లతో మోడీకి బంధం. ఐటీ నివేదిక వెల్లడి. ఐపీఎల్ -2 పైనే దృష్టి! సచిన్, ద్రవిడ్, గంగూలీల పాత్రలేదు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి, ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రితమే క్రౌనే బయటపెట్టాడు. తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. అదేదో ఇప్పుడే కొత్తగా తెలిసినట్లు ఐటీ నివేదిక తేల్చిందట, ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని! అంతే కాదు బావా, సచిన్, ద్రవిడ్, గంగూలీల పాత్రలేదనీ తేల్చిందట. తెలుసా?

సుబ్బారావు:
మొత్తానికీ సీనియర్ సెలబ్రిటీ ఆటగాళ్ళు, చుట్టూ అంత అవినీతి నడుస్తున్నా, తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాళ్ళన్న మాట! మరీ పిల్లి దూరే కంతలో ఎలుక దూరకపోవటం గాకపోతే.... ముంబై ముట్టడి నాడే, పాక్ ముష్కరుల్ని పల్లెత్తి మాట అననీ, ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు, అమాయక ప్రజలకూ సంతాపం కూడా పలకనీ.... సెలబ్రిటీ సీనియర్ క్రికెటర్ల గురించి, ప్రజలకి అర్ధం అయి ఉండదా మరదలా?

సుబ్బలష్షిమి:
ప్రజలకి అర్ధం అయినా, మీడియా, అదేం కాదంటుందిలే బావా! మరి బ్రాండ్ అంబాసిడర్లుగా సదరు క్రికెట్ స్టార్ల్ ని పెట్టి ఎంతో వ్యాపారం, ఎన్నో మోజులు నడిపిస్తుంటే - ఇప్పుడు అటూ ఇటూ అయితే అదంతా ఏం కావాలి? అప్పుడిక ‘బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ బదులు ‘మ్యాచ్ ఫిక్సింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అనాల్సి వస్తుంది.

2 comments: