Saturday, April 10, 2010

ఆ తానులో గుడ్డే అది! సోనియాని బట్టే సింఘ్వీలు!

[కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ, రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోనో శాంటో కంపెనీ తరుపున వాదించటానికి సమ్మతించాడు. దానిపై రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రతినిధులు సోనియాకి ఫిర్యాదు చేశారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోనో శాంటో కంపెనీ తరుపున వాదిస్తాడట అభిషేక్ సింఘ్వీ. అంటే ఆంధ్రా రైతులకి వ్యతిరేకంగానే కదా బావా! ఒక వేళ మోనో శాంటో కంపెనీ గనక గెలిస్తే విత్తన ధరలు పెరుగుతాయి. ఇలాంటి సింఘ్వీలు చేసే ప్రజా సేవేమిటీ?

సుబ్బారావు:
పిచ్చి మరదలా! ఈ నాయకులు ప్రజా సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చారేమిటి? తమ పనులు నడిపించుకోవటానికి వచ్చారు గానీ! అధినేత్రి లాగే అధికార ప్రతినిధులూ!

సుబ్బలష్షిమి:
అందుకేనేమో అంటారు పెద్దలు ’ఆ తానులో గుడ్డే అది!’ అని! సోనియాని బట్టే సింఘ్వీలన్న మాట!

10 comments:

  1. ఆ తానులో గుడ్డే అది!’ ?????

    ReplyDelete
  2. ఆదిలక్ష్మి గారూ,
    మీరు చాలా కాలం క్రితం నన్నో పద్యం అడిగారు...అప్పుడు ఎంత వెతికినా కనపడలేదు..నిన్న యాథలాపంగా భాగవతం తిప్పుతుంటే కనపడింది..ఇక్కడ రాస్తున్నాను...
    ౧) అట్లు గ్రమ్మఱఁ జేరి యయ్యబ్జ పీఠ
    మందు నష్టాంగయోగ క్రియానురక్తిఁ
    బవను బంధించి మహిత తపస్సమాధి
    నుండి శతవర్షములు చనుచుండ నంత.
    ౨) అట్టి యోగజనితమైన విజ్ఞానంబు
    గలిగియుండి దానఁ గమలనయనుఁ
    గానలేక హృదయకమల కర్ణిక యందు
    నున్న వానిఁ దన్నుఁ గన్నవాని.
    ౩) కనియె న్నిశ్చల భక్తియోగ మహిమన్ గంజాతగర్భుండు శో
    భన చారిత్రు జగత్పవిత్రు విలసత్పద్మా కళత్రున్ సుధా
    శన ముఖ్యస్తుతి పాత్రు దానవ చమూజైత్రున్ దళత్పద్మ నే
    త్రు నవీనోజ్జ్వల నీలమేఘ నిభగాత్రున్ బక్షిరాట్పత్రునిన్.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. కృష్ణ గారు: అధినేత్రి ని బట్టే అధికార ప్రతినిధులు అని అర్ధమండి.

    ReplyDelete
  4. కౌటిల్య గారు : ఎంత సంతోషం కలిగిందో మాటలలో చెప్పలేనండి. ఇన్ని రోజులుగా వెదుకుతున్నా, ఇప్పటికి దొరికింది. దేనికైనా భగవత్ కృప ఉండాలంటారు. గుర్తుంచుకుని పంపించారు. చాలా చాలా కృతజ్ఞతలు.

    ReplyDelete
  5. "తాను" అంటే అర్థం కాలేదు... ఇప్పుడు తెలిసింది.. ఈ గుడ్డు కూడా ఆ బాపతే ...అని ..... కృతజ్ఞతలు....

    ReplyDelete
  6. నాకు తెలిసినంత వరకూ పూర్వ కాలం గుడ్డ (క్లాత్) ని తాను ల్లో కొలిచేవారు. సోనియా, సింఘ్వీలన్న (తానులు) వేరయినా ఒక గుడ్డలో నుంచి వచ్చిన వారే కదా అని.

    ReplyDelete
  7. కృష్ణ గారు: తాను అంటే వస్త్ర దుకాణంలో ముడి వస్త్రపు బండిల్ అని అర్ధమండి. ఆ తానులోదే ఆ గుడ్డ అంటే ఆ వస్త్రపు బండిల్ లోదే ఆ వస్త్రం అని అర్ధం. తల్లిదండ్రులని బట్టే పిల్లలు, యజమానులను బట్టే సేవకులు అనే అర్ధంలో వాడతారు. ‘యధారాజాః తధాప్రజాః’ అనే సంస్కృత సామెతకి ఇది తెలుగు రూపాంతర మన్న మాట.

    Rao S. Lakkaraju గారు : వివరణ ఇచ్చినందుకు నెనర్లు!

    ReplyDelete
  8. రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కలసి గుత్తాధిపత్యాల నియంత్రణ సంస్థ(ఎంఆర్‌టీపీ)లో రిట్ దాఖలు చేసింది. అక్కడ వాదోపవాదనలు కొనసాగుతుండగానే ధరలు పెంచాలని మోన్‌శాంటో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ప్రభుత్వం వ్యతిరేకిస్తే నియంత్రణ అధికారం లేదని వాదించేందుకు హైకోర్టును ఆశ్రయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని, రైతులను దగాచేసే ఇలాంటి సంస్థ తరపున వాదించేందుకు మన పార్టీ నాయకుడైన అభిషేక్ సింఘ్వీ సిద్ధపడడం బాధాకరమని కోదండరెడ్డి ఆవేదన చెందారు.

    బీటీ సాంకేతిక పరిజ్ఞానం పేరిట మోన్‌శాంటో ఇప్పటికే రాయల్టీ కింద రూ. 2000 కోట్లు దోచుకుందని, ప్రస్తుతం అమల్లో ఉన్న ధరను రెట్టింపు చేసేందుకు మోన్‌శాంటో ప్రయత్నిస్తోందని వివరించారు. గతంలోనే 450 గ్రాముల పత్తి విత్తనాలను రూ. 1800కు విక్రయించేందుకు యత్నించగా వైఎస్ హయాంలోని ప్రభుత్వం ముకుతాడు వేసిందని తెలిపారు. మోన్‌శాంటోను నియంత్రించకపోతే అదనంగా రూ. 1500 కోట్లు దోచుకుంటుందని తెలిపారు. తక్షణమే స్పందించి అభిషేక్ సింఘ్వీని నియంత్రించాలని కోరారు.

    ReplyDelete
  9. తెలుగు అంటే నా స్నేహితులలో నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఎంతో గొప్పగా భావించేవాడిని... చిన్నప్పుడు స్కూల్ లో పాఠాలు కూడా నాతోనే చదివించేవారు.. కథలు పుస్తకాలు ఎన్నో ఎన్నేన్నో చదివాను కానీ... ఇది నాకు ఎక్కడా తగల్లేదు... ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను....

    ReplyDelete
  10. Thank you so much LakkaRaju gaaru..

    ReplyDelete