Sunday, April 25, 2010

లోతట్టున సజావుగా నడిచిపోతే వ్యవహారాలు, ఆదుపు తప్పి రచ్చకెక్కితే వివాదాలు!

[పవార్ సహా అగ్రనేతల ఫోన్లు ట్యాప్! ఐపీఎల్ వివాదంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం మెడకు చుట్టుకున్న మరో వివాదం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పాపం యూపీఏ ప్రభుత్వం మెడకు మరో వివాదం చుట్టుకుందటగా? పవార్ సహా ప్రతిపక్ష, స్వపక్ష అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని గొడవ రేగిందట తెలుసా?

సుబ్బారావు:
రొంపిలో ఉండి బురద అంటుకుందన్నట్లు.... చేస్తోంది అవినీతి అయినప్పుడు వివాదాలు మెడకు చుట్టుకోక మరేం చుట్టుకుంటాయి మరదలా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అంతా లోతట్టున సజావుగా నడిచిపోతే అవి వ్యవహారాలు, అదుపు తప్పి రచ్చకెక్కితే అవే వివాదాలు!

2 comments:

  1. చివరకు ఏమీ కాదు దొంగలంతా సర్దుబాటు చేసుకుంటారు చూడండి.

    ReplyDelete
  2. ఎంతగా దొంగలంతా సర్ధుబాటు చేసుకున్నా అందరూ దొంగలే నన్నది ఎంతో స్పష్టంగా బహిర్గతమౌతోంది కదా!

    ReplyDelete