Monday, April 26, 2010

కోర్ కమిటీ - కోట బురుజు !

సుబ్బలష్షిమి:
ఈ మధ్య తరుచుగా ‘కాంగ్రెస్ అధిష్టానం’ అనే మాటకు బదులుగా ‘కాంగ్రెస్ కోర్ కమిటీ’ అని వినిపిస్తోందేమిటి? కేసీఆర్ దీక్ష, తెలంగాణా ఉద్యమం - అప్పటి రోజుల్లో అయితే, అన్నిటికీ అధిష్టానం అనే వినబడింది కదా!

సుబ్బారావు:
అప్పట్లో అన్నీ అధిష్టానానికి తెలుసు అన్నారు కదా మరదలా! ‘ఐపీఎల్ లూ, ఎంసీఐ లూ గట్రా అవినీతి మొత్తం తెలిసే ఉండాలి కదా’ అని జనం జోకులు వేసుకుంటున్నారేమో!’ అని కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి అనుమానం వచ్చి ఉంటుంది. అందుకే కోర్ కమిటీ అంటూ.... ప్రధానమంత్రి, గృహమంత్రి, ఆర్ధికమంత్రి గట్రా రోబోలని, రక్షణ గోడలా చుట్టూ నిలబెట్టుకుని ‘కోర్ కమిటీ’ అంటుంది.

సుబ్బలష్షిమి:
ఓహో! తమకి అడ్వాంటేజ్ గా ఉన్నప్పుడు అంతా అధిష్టానం, డిస్ అడ్వాంటేజ్ గా ఉన్నప్పుడు ఉండేది కోర్ కమిటీ అన్నమాట! మొత్తానికీ కోర్ కమిటీ ‘కోట బురుజు’లా బాగుంది బావా!

No comments:

Post a Comment