Friday, April 23, 2010

దావూద్ లు లేకుండానే భారత క్రికెట్ ఉంటుందా? నిప్పులేనిదే పొగ వస్తుందా?

[ఫేస్ బుక్ లో సునందా పుష్కర్ ఐపీయల్ కమిషనర్ లలిత్ మోడి గురించీ చేసిన వ్యాఖ్యలు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఐపీఎల్ - మోడీ - శశిధరూర్ వివాదాల నేపధ్యంలో, శశిధరూర్ మంత్రి పదవి వదులుకోవలసి వచ్చింది. సునంద పుష్కర్ 70 కోట్ల వాటాని వదులుకోవలసి వచ్చింది. ఆమె ఫేస్ బుక్ లో లలిత్ మోడీ గురించి ‘అతడో పెద్ద తార్పుడు గాడు’ అని రాసిందంట. ఏమిటీ గొడవంతా బావా!

సుబ్బారావు:
మోడీ, ధరూర్ ల మధ్య గొడవలు తరువాత చూద్దాం మరదలా! కదులుతున్న ఐపీఎల్ డొంకలో చాలా గోతులే ఉన్నాయి కదా! ఏమైనా.... అలాంటి తార్పుడు గాళ్ళకీ, అవినీతి పరులకే హవా నడుస్తుందనీ, రోజులే అలా మారిపోయాయనీ అందరూ అంటున్నదే కదా, మరదలా!?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! దావూద్ లు లేకుండానే భారత క్రికెట్ ఉంటుందా? నిప్పులేనిదే పొగ వస్తుందా?

1 comment: