[మల్టీప్లెక్స్ ధియేటర్ లో శాట్ లైట్ ద్వారా క్రికెట్ మ్యాచ్ ల ప్రసారం - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ఉచితంగా టీవీలో చూసే క్రికెట్ ని, డబ్బులు పెట్టుకుని ధియేటర్ కు వెళ్ళి ఎవరు చూస్తారు? లలిత్ మోడికి తెలివి లేదా!
సుబ్బారావు:
లలిత్ మోడికి తెలివి లేకపోవటం కాదు మరదలా! ధరలు పెరుగుతున్నప్పుడు జనాల కొనుగోలు శక్తి తగ్గుతుంది. బ్రతుకుపోరాటం పెరుగుతుంది గనక జనాలకి క్రికెట్ మోజులూ తగ్గుతాయి. అప్పుడు మ్యాచ్ ల ప్రసారాలకి వాణిజ్యప్రకటనలు తగ్గుతాయి. అలాంటప్పుడు మోజు తగ్గని కొద్దిమంది నుండి డబ్బులు వసూలు చేసుకోవాలంటే ధియేటర్ కు అలవాటు చేయాలి. మొదట టీవీలలోనూ, ధియేటర్లలోనూ క్రికెట్ మ్యాచ్ ల ప్రసారాలు ప్రదర్శితమౌతాయి. క్రమంగా ధియేటర్ లలో మాత్రమే ప్రదర్శిస్తారు. అప్పుడు టిక్కెట్ల ధరలే కాదు, తినుబండారాలు, పానీయాలు, వాణిజ్యప్రకటనలు కూడా నడుస్తాయి మరదలా! అన్ని రకాలుగా ఆదాయాలే!
సుబ్బలష్షిమి:
మొత్తానికి చాలా తెలివైన సుదూర ప్రణాళిక! సామాన్యుల ఉచిత వినోదాన్ని ఖరీదు పెట్టి చూసే రోజులెంతో దూరంలో లేవన్నమాట!
Subscribe to:
Post Comments (Atom)
నేను ఎప్పటినుండో చెబుతున్నాను క్రికెట్ వలన ఈ దేశానికి గానీ , ప్రజలకు గానీ ఏ ఉపయొగమూ లేదని .అది కొంతమంది డబ్బు దండుకోవడానికి జనాలకి అంటించిన వ్యసనం .ఇప్పటికే నేను చాలా బ్లాగులలో క్రికెట్కి వ్యతిరేకంగా ఎన్నోసార్లు కామెంట్లు రాసాను. నాకు క్రికెట్ పిచ్చి లేనదుకు ఎంతో అదృష్టవంతున్ని. కానీ మా యువత ఎక్కువ సమయాన్ని దీనికే కేటాయిస్తోంది
ReplyDelete