Sunday, April 18, 2010

జనాలని నింపాదిగా తిండి తిననిస్తే, నింపాదిగా ఆలోచించటమూ చేస్తారు మరి!

[ ఈనాడు ఆదివారం అనుబంధంలో ’అవీఇవీ’ శీర్షిక క్రింద "బ్రేక్ ఫాస్ట్ - తప్పనిసరి" అంటూ ...
>>>ఆపీసుకు అర్జెంటుగా వెళ్ళాలి. బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం లేదు. అలాంటప్పుడు...

కీరా దోస, క్యారెట్, చీజ్ శాండ్ విచ్...ఇలా దార్లోనే [కార్లోనో బస్సులోనో వెళ్తూ] తినగలిగే వాటిని తీసుకెళ్ళండి. గుప్పెడు వేరుసెనగ పప్పులో జీడిపప్పులో.... యాపిల్, ఆరటి, ద్రాక్ష లాంటి పళ్లో అయినా ఫర్వాలేదు.

అదీ కుదరనప్పుడు బయట షాపుల్లో దొరికే ఫ్లేవర్డ్ మిల్క్, లస్సీ, కొబ్బరినీళ్ళు... కనీసం ఇవైనా తాగండి"- వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ పేపరు వాళ్ళేంటి ’ఉరకండి ఉరకండి’ అంటున్నారు? మరీ ఇంతగా.... నింపాదిగా కూర్చొని నాలుగు మెతుకులు నోట్లో వేసుకోవడానికి కూడా తీరిక లేనంతగా ఉరకాల్సి రావటం అంటే బ్రతుకుకి అర్ధం ఏమిటి బావా?

సుబ్బారావు:
ఓసి అమాయకపు మరదలా! అలా ఉరకకపోతే ఉద్యోగాలు చేసేదేలా? పన్నులు కట్టేదెలా? వస్తువినిమయాలు సేవలు పొందుతున్నామనుకుంటూ కార్పోరేట్ కంపెనీలకి, వాటికి అండదండలిచ్చే ప్రభుత్వాలకి ఆదాయాలు సమకూర్చేదెలా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! జనాలని నింపాదిగా తిండి తిననిస్తే, నింపాదిగా ఆలోచించటమూ చేస్తారు. అప్పుడు కొంప గుండం అయిపోదూ!? కాబట్టే ‘ఉరకండి, ఉరకండి’ అనేది!

No comments:

Post a Comment