Thursday, April 22, 2010

అన్ని డబ్బులూ మీకేనా? మాకు వాటా ఇవ్వరా !

[ఐపీఎల్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటి కోసం డిమాండ్ - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఏవైనా అవకతవకలు బయటకు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు గొడవ చేస్తూ, సంయుక్త పార్లమెంటరీ కమిటి కోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి. అలాగని నిజాలు వెలికి తీస్తాయా అంటే అదీ లేదూ. మరి ఎందుకలా డిమాండ్ చేస్తారు?

సుబ్బారావు:
అవకతవకలు బయట పడినప్పుడల్లా.... ప్రతిపక్షాలు, అధికార పక్షాన్ని ’అన్ని డబ్బులూ మీకేనా? మాకు వాటా ఇవ్వరా’ అని అడగటమే, ఈ ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయమని’ డిమాండ్ చేయటం! ఒకో సారి అధికార పక్షం ఒప్పుకుంటుంది. చాలా సార్లు ఒప్పుకోదు. అంతే!

సుబ్బలష్షిమి:
అయితే బావా, రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఎప్పుడూ శాసన సభాపక్ష కమిటీ వేయమని డిమాండ్ చేస్తూ ఉంటాయి, ఇందుకేనా!

4 comments:

  1. మీరు వ్రాసిన కామెంట్ కనిపించలేదండి. నరసరావు పేట పేట్రియాట్స్ బ్లాగు మాది కాదండి. ‘అమ్మఒడి’ బ్లాగు నచ్చినందుకు నెనర్లు!

    ReplyDelete
  2. నేను ఇంత వరకూ సెనగలు, పెసర్లు, బొబ్బర్లు విన్నా గాని ఈ ' నెనర్లు ' ఇప్పుడే వింటున్నా. 'నెనర్లు ' అనేది తెలుగు భాషేనాండి? ' ఏదో ' కామెర్లు ' లాగా ఈ నెనర్లేమిటండీ అమ్మోడి గారు?

    ReplyDelete
  3. అజ్ఞాతోడి గారు: నెనర్లు అంటే నెయ్యం [అంటే స్నేహం]తో కూడిన కృతజ్ఞతలు అని. పాత సినిమా పాటలలో కూడా ఉపయోగించిన పదమే ఇది! మీకు తెలిసిన తెలుగు అంతే అయితే ఏం చెయ్యగలం చెప్పండి!నెనర్లు!

    ReplyDelete
  4. ఓడమ్మ గారు , :)
    మీ తెలుగు భాషా పదకోశాపరిణితికి జోహార్లు. నెయ్యం నుచి పుట్టిందా? నేతిబీరకాయలో నెయ్యి వున్నంత ఆపదం లో నెయ్యం ఆనవాళ్ళు వున్నాయి. మరీ మొదటి అక్షరం తప్పితే 'నర్లూ ఎలా అంటుకుందంటారు? నెర్రె అంటే చీలిక అని అర్థం అనుకుంటా, మరి నెనర్లు అంటే చీలిపోయిన నెయ్యం కావాలి కదండీ .. ఏదో మీరు తెలుగుభాష మీద మీకు మాంచి పట్టు వున్నదని వాపోతున్నారు కాబట్టి అడుగుతున్నా.. తెలిసీ చెప్పకుంటే రామోజీ దేశప్రధాని అయిపోవాలని నా ఒట్టు.

    మీ లాజిక్ ప్రకారం వియ్యర్లు అంటే వియ్యాల వారికి కృతజ్ఞ్తలు అంతేనా? మరి అయ్యర్లో! :P

    ReplyDelete