Tuesday, April 20, 2010

దుబాయ్ ని కాపాడేందుకు ధరూర్ రాజీనామా !

[శశి ధరూర్ రాజీనామా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఐపిఎల్ వివాదంతో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి శశి ధరూర్ రాజీనామా చేసాడట. ఆ వార్త వ్రాస్తూ ఈనాడు ’శశిధరూర్ క్లీన్ బౌల్డ్.... ’మంత్రి వివరణలతో సమాధాన పడని కాంగ్రెస్ కోర్ కమిటీ’ ’పార్లమెంటు సజావుగా నడపటం కోసమే చేదు నిర్ణయం’ అంటూ వ్రాసింది చదివావా?

సుబ్బారావు:
చదివాను. అయితే ఏం?

సుబ్బలష్షిమి:
అది కాదు బావా! ఓ వైపు మంత్రి వివరణతో సమాధాన పడని కోర్ కమిటీ అంటారు, మరో ప్రక్క చేదు నిర్ణయం అంటారేమిటి? చేదు నిర్ణయం అంటే, ఇష్టం లేకపోయినా తీసుకున్న నిర్ణయమనే కదా? అంత ఇష్టం లేకుండా నిర్ణయం తీసుకున్నారంటే మంత్రి వివరణతో సమాధాన పడి ఉండాలి కదా? ఒకే విషయమై ఇంత పరస్పర విరుద్దమైన ఉపశీర్షికలేమిటి? అయోమయంతో ఉండి వ్రాసారా, ప్రజలని అయోమయంలో పెట్టాలని వ్రాసారా?

సుబ్బారావు:
రెండూ కాదు మరదలా! కావాలనే వ్రాసి ఉంటారు. ఎందుకంటే - ఐపిఎల్ మూలాలూ, భారత క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగూ, బెట్టింగులతో కలిపి భారీ వ్యాపార మూలాలూ, దుబాయ్ లోకి దారి చూపుతున్నాయి కదా! అర్జంటుగా దుబాయిని కాపాడుకునేందుకే ఇదంతా!

సుబ్బలష్షిమి:
అంటే ’కన్నా?కాలా?’ స్ట్రాటజీలో దుబాయ్, అందులోని మాఫియా... ‘కన్ను’ అయితే, శశిధరూర్ పనికిమాలిన ’కాలు’ అయిపోయాడన్న మాట!

No comments:

Post a Comment