[జైపూర్ లో ఐపీయల్ మ్యాచ్ లో ఛీర్ గర్ల్స్ కీ, మద్యం సేవించడానికీ అనుమతినిచ్చిన అధికారులు - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! జైపూర్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో, ఛీర్ గర్ల్స్ ని అదికారులు ముందు అనుమతించలేదట. తర్వాత వత్తిడి వచ్చి ఛీర్ గర్ల్స్ తో పాటు స్టేడియంలో మద్యం కూడా తాగొచ్చని అనుమతులిచ్చేసారట తెలుసా?
సుబ్బారావు:
వత్తిడి అంటే ఏముంటుంది మరదలా! రాజస్తాన్ లోనూ, కేంద్రంలోనూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఛీర్ గర్ల్స్ కి అనుమతి నిరాకరణ తర్వాత, ఐపీఎల్ నిర్వాహకులు, అధికారుల దగ్గరి నుండి రాజకీయ అధినేత్రుల దాకా, కాసుల మూటల పంపకాలు పూర్తి చేసి ఉంటారు. దాంతో ఛీర్ గర్ల్స్ కేం ఖర్మ, మద్యానికీ అనుమతి వచ్చేసి ఉంటుంది. మొత్తానికీ మందేసి మరీ చిందులు చూడొచ్చన్న మాట!
సుబ్బలష్షిమి:
బావా! ఒకప్పుడు మద్యం పుచ్చుకున్నవాళ్ళు, పెద్దల కంటపడకుండా, తక్కుతూ తారుతూ వచ్చి గమ్మున ఇంట్లో దూరేవాళ్ళు. తర్వాత రోజుల్లో ప్రభుత్వమే అబ్కారీ విధానం చేపట్టింది. అయినా మరీ ఇంతగా బరితెగించటమా! ఏమైనా విదేశీ మహిళ ప్రభుత్వ ఛైర్మన్ గా ఉండి... మొత్తం విదేశీయతనీ ఈ గడ్డ మీదికి దించేస్తోంది బావా!
సుబ్బారావు:
అంతేనా, ఈ విదేశీ మహిళ ఆహార భద్రత చట్టం తేవాలని పట్టుబడుతుందట తెలుసా మరదలా!
సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఉన్న డబ్బులు మద్యం వ్యసనానికి ఖర్చుపెట్టాలి కదా? ఇంట్లో వాళ్ళకి కనీస ఆహార భద్రత ఏర్పాటు చేస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు "ఈ విదేశీ దేవత వలనే మనం కనీస ఆహారం తింటున్నామని" గొప్పలు చెప్పుకోవచ్చు! దీన్నే అంటారేమో ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కోవటం అని!
Thursday, April 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment