Thursday, April 1, 2010

ప్రజాసేవ అంటే ప్రజలపై పన్నుల వడ్డింపు అని అర్ధం!

[భూవినియోగ మార్పిడి ఛార్జీల పేరుతో బాదుడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎప్పుడో వ్యవసాయభూములని ప్లాట్లుగా మార్చి ఇళ్ళు కట్టుకున్నారు. అలా వ్యవసాయభూములని మార్చుకున్నందుకు ప్రభుత్వానికి పన్నులు కట్టాలట? అవీ ఒకప్పుడు చాలా మామూలు ఛార్జిలుండేవట. ఎప్పుడో గప్పుచుప్పున వాటి పన్నుశాతాన్ని బాగా పెంచారు. ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులవసరమై ఆ చట్టానికి పదునుపెట్టారు. అదీ కూడా ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం, ఆ భూమి విలువలో పదిశాతం పన్ను వసూలు చేస్తారట బావా! ఇది అన్యాయం కాదా?

సుబ్బారావు:
అన్యాయమేమిటి మరదలా! ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయటం ఎప్పుడో మర్చిపోయాయి. ప్రజలను పన్నుల రూపేణా దోచుకోవటమే ఇప్పటి ప్రభుత్వాల లక్ష్యం! అందులో న్యాయన్యాయల విచక్షణకి తావే లేదు. అది అర్ధం చేసుకో మరదలా!


సుబ్బలష్షిమి:
అంతేలే బావా! పాక్ ఉగ్రవాదులు ప్రభుత్వానికి అయినవాళ్ళు, ప్రజలు కానివాళ్ళు మరి!

No comments:

Post a Comment