Thursday, April 15, 2010

కాంగ్రెస్ వాళ్ళకి హఠాత్తుగా సామాన్యుడెందుకు గుర్తు కొచ్చాడూ?

[>>>న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాలు భారత ప్రభుత్వాన్ని పెద్ద దురాక్రమణదారుగా చూస్తున్నాయని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అభిప్రాయపడ్డారు. గ్రామాలు జాతీయ స్రవంతి లో కలవాలంటే భారత రాజ్య వ్య వస్థ మరింత మానవీయంగా మారా లన్నారు. అయితే ఈ అభిప్రాయం తన వ్యక్తిగతమని వివరించారు. - మనీష్ తివారీ
>>>తూటా బాధితుడు సామాన్యుడే - దిగ్విజయ్ సింగ్, వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఏమిటీ ఈ మధ్య హఠాత్తుగా కాంగ్రెస్ నాయకులందరికీ సామాన్యుడు గుర్తుకొస్తున్నాడు? మొన్న మనీష్ తివారీ సిఐఐ అధ్వర్యంలో జాతీయ గ్రామీణ సదస్సులో ప్రసంగిస్తూ ’భారతీయ గ్రామీణులు భారత ప్రభుత్వాన్ని పెద్ద దురాక్రమదారు’గా చూస్తున్నాయన్నాడు. ఈ రోజు చిదంబరాన్ని మేధో అహంకారి అంటూ విమర్శిస్తూ, మావోయిస్టుల విషయంలో అతడితో విభేదించిన దిగ్విజయ్ సింగ్ ’తూటా బాధితుడు సామాన్యుడే’ అన్నాడు.

మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానం సోనియా, జాతీయ ఆహార భద్రత గురించి మాట్లాడుతూ, మంత్రులంతా ఎవరి దోవన వాళ్ళు పనిచేస్తున్నారనీ, వాళ్ళెవరికీ సామాన్యుడు పట్టటం లేదనీ ఆగ్రహం వెలిబుచ్చి, తానే దగ్గరుండి జాతీయ ఆహార భద్రత చట్టానికి మెరుగులు దిద్దిస్తుందట! ఈ కొత్త మార్పేమిటి బావా?

సుబ్బారావు:
ఏముంటుంది మరదలా? హఠాత్తుగా అందరికీ సామాన్యుడు గుర్తుకు వచ్చాడంటే - అవసరాలు, సమీకరణాలు మారి ఉంటాయి.

No comments:

Post a Comment