Friday, April 23, 2010

ఎంత గొప్పవి ఈ పత్రికా విలువలు?

[ఐపీఎల్ దుమారంపై , ఐపీఎల్ ఆటపై - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు[23 ఏప్రియల్] ఈనాడు పేపర్ చూసావా? ఐపీఎల్ అవకతవకల మీద ఇంత దుమారం రేగుతుంది కదా! మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ కూడా జరుగుతుందని కదా మొత్తం గొడవ జరుగుతుంది. కానీ ఈనాడు, వాటి గురించి పావు పేజీ కూడా కేటాయించలేదు. తనకి కావాలనుకుంటే మొత్తం పేపర్ అంతా అదే వ్రాసేవాడు. అదే ఐపీఎల్ జట్ల ఆటల గురించి మాత్రం, ఆటల పేజీలో ’చెన్నై కింగ్స్ సూపర్’ అంటూ నిలువెత్తు పేజీ కేటాయించాడు.

సుబ్బారావు:
క్రికెట్ గురించిన అవకతవకలని బయటపెడితే ఏంలాభం మరదలా! జనాలకి క్రికెట్ మోజులు పుట్టిస్తేనే బెట్టింగ్ వ్యాపారాలు మస్తుగా నడుస్తాయి మరి! ఈనాడు తన నైజాన్నే బయటపెట్టుకుంది, అంతే!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! సూర్యాపత్రిక అధిపతి, కాళేశ్వర్ బాబా ని డబ్బులు డిమాండ్ చేసాడట. కాళేశ్వర్ బాబా తరుపు మనిషి ‘రివర్స్ స్ట్రింగ్ ఆపరేషన్’ చేయటంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. దాని గురించి ఒక్క మాట కూడా ఈనాడు వ్రాయలేదు ఎందుకని?

సుబ్బారావు:
అంటే అప్పుడు పత్రికా విలువలు గుర్తుకు వస్తాయి మరదలా! ఒక పత్రిక వ్రాసిన దాని మీద రెండో పత్రిక ఏమీ మాట్లాడకూడదని పత్రికల మధ్య ఉన్న ‘పత్రికా విలువ’లట. అంటే తెరచాటు ఒప్పందాలన్న మాట. బహుశః అలాగే సూర్యాపత్రిక మీద ఇప్పుడు తను వ్రాస్తే, తన అవకతవకల మీద రేపు వేరే పత్రికలు వ్రాస్తాయని, ఈనాడు వ్రాసి ఉండదు. అంతే!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఎంతో గొప్పవి ఈ పత్రికా విలువలు!

1 comment:

  1. eenadu has written about alleged scam in IPL.
    http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel5.htm

    ReplyDelete