Wednesday, May 5, 2010

మృతుల అనుమతి తీసుకునే చంపాడా?

[నిందితుడి అనుమతి లేకుండా నార్కో పరీక్షలు నిర్వహించటం రాజ్యాంగ విరుద్దం - సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తో కూడిన డివిజన్ బెంచ్, ముంబై ముట్టడి విలన్ కసబ్ కేసు విషయమై, నిందితుడి అనుమతి లేకుండా నార్కో పరీక్షలు జరపటం రాజ్యాంగ విరుద్దమని తీర్పు చెప్పిందట. మరి సదరు నిందితుడు, భారత దేశం అనుమతి తీసుకుని వచ్చాడా, మృతుల అనుమతి తీసుకునే చంపాడా బావా?

సుబ్బారావు:
అవన్నీ అడగ కూడదు మరదలా! అసలు రాజ్యాంగం, మానవహక్కుల సంఘాలూ ఉన్నదే నిందితులనీ, నేరగాళ్ళనీ కాపాడేందుకు! ఆ కర్తవ్యాన్నే శక్తి వంచన లేకుండా కోర్టులూ నిర్వహిస్తున్నాయి. అలాంటప్పుడు తీర్పులు ఇలా ఉండక, ఇంకెలా ఉంటాయి చెప్పు!

2 comments:

  1. అది కూడా నిజమే ... నిందితుడి పై అభియోగాలు బలీయమైనవైనప్పుడు .. అతడు చేసిన హింస స్థాయి ఎక్కువైనప్పుడు వారి హక్కులకు భంగం కలిగించుట తప్పు కాదు.. చూస్తుంటే అజ్ఞాత చెప్పినట్లు బాలకృష్ణన్ కూడా అదే కోవకి చెందిన వాడనిపిస్తుంది....

    ReplyDelete
  2. న్యూఢిల్లీ: వారం రోజుల్లో పదవీ విరమణ చేయబోతుండటంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ రాజ్యాంగ ప్రాముఖ్యం ఉన్న కేసులలో తీర్పులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అంబానీ సోదరుల గ్యాస్ వివాదం కేసు కూడా వీటిలో ఒకటి. నార్కో అనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్ టెస్టుల రాజ్యాంగ బద్ధత, ఎంపీ లాడ్స్ పథకం, కేంద్రంలో ప్రభుత్వం మారిన వెంటనే గవర్నర్ల మార్పు వంటి అంశాలపై తీర్పులు రావా ల్సి ఉంది.

    ఈనెల 11న పదవీ విరమణ చేయబోతున్న ప్రధాన న్యాయమూర్తి మూడు కేసు ల్లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అధిపతిగా ఉన్నారు. నార్కో టెస్టుల చట్టబద్ధతపై తీర్పును 2008 జనవరిలో వాయిదా వేశారు. ఎంపీ లాడ్స్, గవర్నర్ల తొలగింపు కేసుల్లో తీర్పులు 2009 జనవరి, సెప్టెంబర్ నెలల్లో వాయిదా పడ్డాయి. అంబానీ సోదరుల వివాదం, కేజీ బేసిన్ గ్యాస్ ధరపై తీర్పు కోసం కార్పొరేట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తీర్పును గత ఏడాది డిసెంబర్ 18న రిజర్వు చేశారు.

    ReplyDelete