Monday, March 8, 2010

కాకుల్ని కొట్టి గద్దలకి పెట్టటం అంటే ఇదేనేమో!

[వ్యవసాయ భూముల్లో 20 సెంట్ల వరకు (దాదాపు వెయ్యి చదరపు గజాలు) కొనుగోలు చేస్తే దానికి ఇంటి స్థలం ధరను లెక్కగడతారు. అంటే ఒక చిన్నరైతు కూరగాయల సాగుకోసం కొద్దిపాటి విస్తీర్ణం కొనుక్కొన్నా ఇంటి స్థలం లెక్కన స్టాంపు రుసుం చెల్లించాలి. దీనివల్ల స్థలాన్ని ఎంతకు కొంటామో స్టాంపు రుసుం రూపేణా అంతే మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఏర్పడుతుంది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, సెజ్ లు, ఐటీ పార్కుల సమీపంలో ఉన్న భూముల విలువలను పెంచుతారు. - ఏప్రియల్ నుండి భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచనున్నారన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రభుత్వం, భూముల మార్కెటు విలువను భారీగా పెంచేస్తుందట తెలుసా! దాంతో భూముల క్రయవిక్రయాలలో రిజిస్ట్రేషన్ ఫీజు బాగా పెరుగుతుందట. ఇప్పుడు భూమిపై కొనుగోలుదారుడు 9.5 శాతం స్టాంపు రుసుం చొప్పున 9,500 రూ. కడుతుండగా, కొత్త విలువ వచ్చాక 23,750 రూ. చెల్లించాల్సి వస్తుందట.

సుబ్బారావు:
అదే కార్పోరేట్ కంపెనీల కోసం సేజ్ లను, ఎకరా రూపాయి నుండి వందరూపాయలు ధరకు వేలాది ఎకరాలు కట్టబెట్టేసారు మరదలా!

సుబ్బలష్షిమి:
కాకుల్ని కొట్టి గద్దలకి పెట్టటం అంటే ఇదేనేమో బావా!

2 comments:

  1. ఆదిలక్ష్మి గారూ !
    మీ టపాకాయ పేలుళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అవి ఎప్పుడూ మోత మోగిస్తూనే వున్నాయి. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  2. ధన్యవాదాలండి!

    ReplyDelete