Tuesday, March 9, 2010

అన్నదానాలు చేస్తే అన్నీ ఓకేనా!?

[>>>ఉత్తర ప్రదేశ్ లో కృపాలు మహారాజ్ అనే స్వామిజీ ఆశ్రమంలో, తన భార్యకు శ్రాద్దం పెట్టే సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తుంటారు. పేదలకు స్టీల్ కంచం, పది రూపాయల నగదు, ఒక లడ్డూ, చేతి రూమాలు పంచి పెడతారని నిర్వాహకులు ప్రకటించారు. ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగి 71 మంది చనిపోయారు.

>>>ఆ స్వామీజీ మీద కూడా లైంగిక వేధింపులు, ఆశ్రమంలో అవకతవకలు గట్రా ఆరోపణలు ఉన్నాయి. - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ బాబా ఎవరో.... అన్నదానం, వస్తుదానం చేస్తానంటే పదివేల మంది గుమిగుడారట. తొక్కిసలాటలో 71 మంది చనిపోయారు. సదరు బాబా ఆశ్రమంలో అక్రమాలుకూ కొదవేం లేదు.

సుబ్బారావు:
అప్పుడెప్పుడో ’అమ్మఒడి’ బ్లాగులో ’ఇస్కాన్’ అవకతవకల గురించి వ్రాస్తే... కొందరు జ్ఞాత, అజ్ఞాత వ్యాఖ్యాతలు "వాళ్ళు కనీసం పేదలకి అన్నదానం చేస్తున్నారు. వాళ్ళనీ విమర్శించకుండా వదలరా మీరు?" అన్నారు. ఓ ప్రక్క సమాజాన్ని నాశనం చేస్తూ, మరోప్రక్క సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫోజు పెడితే చాలు’, అన్నీ బాగానే ఉన్నాయి’ అనుకునేంత కాలం ఇలాంటి బాబాలు ఉంటూనే ఉంటారు మరదలా!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! వస్తుదానం అంటూ ఆ బాబా ఇచ్చేదేమీటో తెలుసా? ఓ స్టీల్ కంచం, పది రూపాయల నగదు, ఒక లడ్డూ, చేతి రూమాలు. వాటి కోసమే అంతమంది వచ్చారంటే ఆ యూపీలో పేదరికం ఏ స్థాయిలో ఉండాలి బావా!? ఆ మాయావతి భారీ విగ్రహాల స్థాపనకి అయ్యే కోట్ల రూపాయల వెచ్చించినా అక్కడ పేదలందరికీ ఇలాంటి వస్తుదానాలు ఇంకా ఎక్కువగానే చేయవచ్చేమో కదా?

సుబ్బారావు:
ఈ మాయావతి ప్రధాని కావాలనుకున్నది. ప్రధానే అయ్యింటే దేశప్రజల పరిస్థితి ఒక్కసారి ఊహించు మరదలా!? దేశమంతా ఎన్ని విగ్రహాలో!!

1 comment:

  1. బొమ్మలోయ్ బొమ్మలు. మాయావతి బొమ్మలు, అంబేద్కర్ బొమ్మలు, కాంశీరామ్ బొమ్మలు. బొమ్మలమింద కాకమ్మల రెట్టలు. ఎందుకీ బొమ్మలు. మాయదారి బొమ్మలు.

    బాబోయ్ బాబాలు. బుచికి బుచికి బాబాలు.

    ReplyDelete