Monday, March 29, 2010

ప్రాణాలతో ఉన్నందుకు పన్నులు కట్టండి!

[బస్టాండుల్లో ప్లాట్ ఫామ్ టిక్కెట్టు ప్రవేశపెట్టాలనుకుంటున్న ప్రభుత్వం వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎర్రబస్సు పేదవాడి ప్రయాణ సాధనం. సామాన్యులు వచ్చిపోయే బస్టాండుల్లో యూజర్ ఛార్జీలంటూ ప్లాట్ ఫాం టిక్కెట్టు ప్రవేశపెడతారట. ముందుగా ప్రయోగాత్మకంగా హైదరాబాదులో నట. తర్వాత మెల్లిగా విజయవాడ తిరుపతి గట్రా నగరాల్లో కూడా ప్రవేశపెడతారట. తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే పేదలు రాత్రి పూట బస్టాండులోనే నిద్రపోతారు. అలాంటి చోట ప్రవేశ టిక్కెట్లంటే ఎంత దారుణం బావా?

సుబ్బారావు:
అప్పుడే ఆక్రోశ పడకు మరదలా! ఇప్పటికే మంగలి షాపుల్లో కుర్చీలకి పన్నులేసింది ప్రభుత్వం. అంటే జుట్టున్నందుకు పన్నన్న మాట. ఇక ముందు ముందు.... ఊపిరి పీలుస్తూ ఆక్సిజన్ ని, విడుస్తూ కార్బన్ డైయాక్సైడ్ ని ఉపయోగిస్తున్నందుకు ముక్కులకి కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు.

సుబ్బలష్షిమి:
అంటే ప్రాణాలతో ఉన్నందుకు పన్ను కట్టాలన్న మాట. నిజమేలే బావా! ఇప్పటికే వాళ్ల దృష్టిలో ప్రజలున్నది పన్నులు కట్టేందుకు, కార్పోరేట్ వ్యాపారాలు నడిచేందుకూ!

2 comments:

  1. పాత బస్తీలో అల్లర్లు మొదలయ్యాయి అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారే రోజులు దగ్గర పడ్డాయన్న మాట ... ముసలోడ్ని సాగనంపి ఏ గీతారెడ్డో లేక చంద్రబాబో తెర మీద కొస్తారన్న మాట

    ReplyDelete