Thursday, December 10, 2009

భారతదేశంలో, భారతీయులమని చెప్పే ముస్లింలు ఎంతమంది?

[భారత్ - పాక్ సంబంధాలు - ’లోగుట్టు’ శీర్షికలో ’అపనమ్మకాలే అడ్డుతెరలు’ అనే వ్యాసంలో, ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ - పాక్ జనాభాలోని ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే మాత్రమే పాక్ ప్రభుత్వం పట్ల గురి ఉన్నట్లు నీల్సన్ పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పాక్ ప్రజల్లో అత్యధికులు ముందుగా తాము ముస్లిములమని, ఆ తరువాతనే పాకిస్థానీయులమని భావిస్తున్నట్లు ఆ సర్వేలో వెల్లడయింది. ఆ దేశంలో ఇస్లామిక్ భావనలు మరింత ప్రబలతున్నాయనడానికి ఇది నిదర్శనం..... అని వ్రాసిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చదివావా? పాకిస్తాన్ లో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది, ముందు తాము ముస్లింలమనీ తర్వాతే పాకిస్తానీయులమనీ భావిస్తారట.

సుబ్బారావు:
అందులో వింతేముంది మరదలా! మత ప్రాతిపదికన చీలిపోయిన పాకిస్తాన్ లో, ప్రజలు అలా ఉండటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, గౌరవం ఉన్నాయంటూ మన దేశంలో ఉండిపోయిన, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ముస్లింలలో కూడా, అత్యధికులు ముందు తాము ముస్లింలమని భావిస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే. MIM నేతల్ని చూసినా, వందేమాతర గీతం పాడేది లేదని తెగేసి చెప్తున్న ముస్లింలని చూసినా ఇది బాగానే అర్ధమౌతోంది. భారతీయతని గౌరవించమన్న విషయం పాకిస్తాన్ చీలేటప్పుడే చెప్పి ఉంటే బాగుండేది. బలం పుంజుకున్న తర్వాత చెప్తున్నారు.’భారతదేశంలో, భారతీయులమని చెప్పే ముస్లింలు ఎంతమంది?’ అన్న లెక్కలు తేల్చే అధ్యయానాలే ఏ సంస్థలూ చేయటం లేదు, చేసినా నిజాల లెక్కలని పత్రికలు ప్రచురించటమూ లేదు. అంతే!

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! ఒక దశలో భారత్ ముస్లింలలో కొందరు, ’అజారుద్దీన్ సెంచరీ చేయాలి, పాకిస్తాన్ మ్యాచ్ గెలవాలి’ అన్నారని కూడా విన్నాము. మతం మానవత్వాన్ని మరిచిపోయాక ఇక దేశం మాత్రం ఏంగుర్తుంటుంది?

3 comments:

  1. థు నియమ్మ , 'నేను ఇండియన్ ముస్లిం' అని చెప్పేవాళ్ళు కొట్లలో ఉన్నారు, నీకు వినాలని ఉంటె.

    ReplyDelete
  2. అయ్యా జావేదు,

    ముందు మీ ఊరు, పేరు చెప్పుకోగల ధైర్యం తెచ్చుకోండి. ఎదుటి వారిని గౌరవించే సంస్కారాన్ని నేర్చుకోండి. భాషా, మర్య్దాద నేర్చుకోండి. తరువాత ముస్లింల గురించి గానీ, హిందువుల గురించి గానీ, మనుష్యుల గురించి గానీ వ్యాఖ్యానించవచ్చు.

    ReplyDelete
  3. భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు
    హిందూ దళితులే!
    కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు
    మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక

    న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.

    'హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు' అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.

    పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. 'కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి' అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
    ఆంధ్రజ్యోతి 11.8.2008

    ReplyDelete