Thursday, January 8, 2009

04. మేధావుల మాటలకు అర్ధాలే వేరులే

“భద్రతాదళాల చేతుల్లో వేలమంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా – హురియత్ చెబుతున్నదానికి, వాస్తవిక పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని అక్కడి ప్రజలు గ్రహించారు. పోలింగ్ కు వారు పెద్దయెత్తున తరలిరావడానికి కారణం అదే. అలాగని – ఇండియా వేరు, తాము వేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్న పంధాకు కాశ్మీరీలు స్వస్తి చెప్పారనీ భావించరాదు. వారు ఎన్నికల్లో పెద్దయెత్తున పొల్గొన్నారంటే దాని అర్ధం – న్యూఢిల్లీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు హురియత్ అనుసరిస్తున్న తీరును కాశ్మీరీలు నిలదీస్తున్నారన్నదే. రాష్ట్రాన్ని అట్టుడికించిన హింసాకాండ, తీవ్రవాదం పట్ల వారు విసుగెత్తిపోయారు. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడి, తిరిగి శాంతి నెలకొనాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల్ని అడ్డుకుంటే ప్రజలు ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయంతో తీవ్రవాదులు సైతం పోలింగ్ కు అంతరాయం కలిగించలేదు.” …… కులదీప్ నయ్యర్, ఈనాడు, పేజ్ నెం.4, 07/01/2009.

సుబ్బలష్షిమి:
ఈ కులదీప్ నయ్యర్ ఓ వైపు కాశ్మీరీలు ఎలక్షన్లలో ఓటు వేసారంటే తీవ్రవాదాన్ని తిరస్కరించారనీ, ప్రజాస్వామ్యాన్ని సమర్ధించారనీ అంటాడు. మరోవైపు కాశ్మీరీలు అలా ఎలక్షన్లలో ఓటు వేసారంటే అర్ధం వాళ్ళు తమని తాము భారత్ లో భాగం అని ఒప్పుకున్నట్లు కాదు అంటాడు.

సుబ్బారావు:
ఏమన్నాడు?

సుబ్బలష్షిమి:
తీవ్రవాదాన్ని వ్యతిరేకించారంటే అర్ధం ప్రజాస్వామ్యాన్ని సమర్ధించినట్లట. బాగానే ఉంది. మరి భారత ఎన్నికల కమీషన్ నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేయడమంటే భారత్ లో తాము భాగం అని ఒప్పుకున్నట్లు కాదట. అంటే అర్ధం ఏమిటంటావు బావా?

సుబ్బారావు:
అర్ధం లేని మాటల్నే మేధావుల మాటలు అంటారేమో మరదలా, నాకూ తెలీదు.

*************

6 comments:

  1. Please change the background colour if possible :)

    ReplyDelete
  2. పాకిస్తాను ఎన్ని ద్రోహాలు చేసినా, మనం స్నేహ హస్తం అందించాలని ఉదరగోడుతుంటారు ఇటువంటి వారు.

    ReplyDelete
  3. మేధావుల మాటలకు అర్థాలు వేరు కాదు. మీకు కాశ్మీర్ సమస్యపై అవగాహన లేదు అంతే!

    Seeking good governance and jobs is Kashmiri's need. Wanting autonomy is their aspiration.మొదటిదానికోసం ఎన్నికల్లో పెద్దస్థాయిలో పాల్గొన్నంత మాత్రానా రెండోదానికీ ఒప్పుకున్నారని చంకలు గుద్దుకుని ఆ సమస్యను పక్కనపడేస్తే మరింత జఠిలమవుతుంది.We need to address that also.

    ReplyDelete
  4. Good one.
    Please change the background colour if possible

    ReplyDelete
  5. Please change the background colour if possible :)

    ReplyDelete