Wednesday, January 21, 2009

16. తెలం’గానం’

[’తెలంగాణా’ విషయంలో ఢిల్లీలో నడిచిన హైడ్రామా, ’తెరదించేసారు’ ఎన్నికలనాటికి ఏదో ఒకటి చెబుదాం, గడువులేం లేవు, వగైరా – తొలిపేజీ వార్తలు, ఈనాడు 20-01-2009 నేపధ్యంలో ......]

సుబ్బలష్షిమి;
గిదేంది బావా! గీ పేపరోళ్ళు, పార్టీలోళ్ళు తెలంగాన మంటూ ఓ గిట్ల లొల్లి పెడుతరేంటి? నిజంగా మల్ల జనమే తెలంగానం గావాల్నంటే మరి పోయనేడు బై ఎలచ్చన్ల తెరాస నోడ గొట్టిన్రెందుకు? గసలా పెద్దాయన కే.సీ.ఆర్. కే రెండు లచ్చల ఓట్లు నుండి పదేనేల ఓట్ల మెజార్టికి పడిపోయెండు గదే? జనాలకి సరుకుల రేట్లు జూసే కళ్ళంట నీళ్ళొత్తంటే ఇంగా ఏ రాట్టమైతే నేంది? గట్లమల్ల జార్ఖండ్ల సూట్టంలా?

సుబ్బారావు:
అవ్ మల్లా. పేపరోళ్ళకీ, పార్టీ వోళ్ళకీ లొల్లి జయ్యనికే జనాలక్కర్లే. ఆల్లల్లో ఆల్లే లొల్లి బడతరు.

సుబ్బలష్షిమి:
ఆల్లల్లో ఆల్లే గట్ల లొల్లి బెట్టుకుంటే మరిమనమేంటి జేసెడిది?

సుబ్బారావు:
సైల్మాటాకీసు కెల్లి జూడక్కర్లే. ఇంటగూకనే సైల్మా జూడచ్చనుకోవాలె. గదంతే పోరీ!

****************

5 comments:

 1. ’పెడుతరేంటి’, ’నిజంగా’, ’పెద్దాయన’, ’సూట్టంలా", ’లొల్లి బడతరు’, ’జూడక్కర్లే’ వంటి పదాలు చూడగానే తెలిసిపోతుంది ఇది "నకిలీ తెలంగాణ" వ్యవహారమని. తెలంగాణ వాళ్ళు ప్రయత్నించి ఆంధ్రా ప్రాంతంలోని ఏ మాండలికాన్నైనా అచ్చు గుద్దినట్టు మాట్లాడగలరు. ఆంధ్రా వాళ్ళు చచ్చి గీపెట్టినా సహజసిద్ధమైన తెలంగాణ మాండలికాన్ని పరిపక్వంగా మాట్లాడలేరు. చేతగానప్పుడు ఎందుకీ ప్రయాస?

  ReplyDelete
 2. మీరన్నట్లు నాకు తెలంగాణ యాస రాదండీ! కాకపోతే నేర్చుకోవాలని, వ్రాయాలని ప్రయత్నించటం లో తప్పులేదనుకొంటాను.

  ReplyDelete
 3. బాగా చెప్పారు :)
  సినిమా హాలు దాకా వెళ్ళడం ఎందుకని.. జనాల మీద దయ తలిచి టీవీల్లోనూ, పేపర్లలోనూ రోజుకో సినిమా చూపిస్తున్నారు మన నాయకులు :)

  ReplyDelete
 4. వెంకట లక్ష్మి : కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చుడు ఇష్టం లేకపోతె 2004 ల తెరాస తోని పొత్తెందుకు పెట్టుకున్నది ? .
  సోనియమ్మ తెరాస జండా కప్పుకొని ప్రచారం ఎందుకు చేసింది?
  ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎందుకు ఏసింది ?
  ధర్మరాజు అసొంటి అబ్దుల్ కలాం తోని, మచ్చలేని మన్ మోహన్ సింగ్ తోని నిండు పార్లమెంటుల అబద్దాలు ఎందుకు చెప్పించింది ? బై ఎలక్షన్ల మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు , తెలంగాణా కాంగ్రెస్స్ తోనే సాధ్యం అని బ్రోకర్ మాటలు ఎందుకు మాట్లాడింది .??
  ఏంటిది మామ గిదంతా ?
  బజారు దాని కున్నంత నియ్యత్ కూడా గీ పెద్ద మనుషులకు లేకపోతె ఎట్లా మామ ?

  వెంకట రావు :గది అంతేనే పోరి !. కాంగ్రెస్ అంటే ఎందనుకున్నావు ? ఓడ ఎక్కే దాక ఓడ మల్లన్న ఓడ ఎక్కి నంక బోడి మల్లన్న !!?

  వెంకట లక్ష్మి : గందుకే గీ దేశం గిట్ల కాలబడ్డది . థూ... మన బొందిలో పాణం వున్నంత కాలం బాగు పడేటట్లు లేదు. వీళ్ళు మనల్ని బతకనియ్యరు. పైకి రానియ్యరు. వీళ్ళ కు గత్తరన్న రాకపాయే

  ReplyDelete
 5. ప్రభాకర్ గారూ,

  మీ టపాకాయ ఢామ్మని బాగా పేలింది సుమా!

  ReplyDelete