Thursday, January 29, 2009

22. ఏ సుత్తి అయినా ఒకటే గుండు పగలగొట్టటానికి

[మూసీనది ఒడ్డున, సన్ సిటీ కోసం భూములు గుంజు కుంటున్న ప్రభుత్వం వార్తల నేపధ్యంలో.....]


సుబ్బలష్షిమి:

ఓ వైపు వ్యవసాయం పండగ అంటూ మరో వైపు భూములు లాగేసుకుంటాడేమిటి బావా ఈ ముఖ్యమంత్రి?


సుబ్బారావు:

ముందటి ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ, కార్పోరేట్ వ్యవసాయం మేలు, ఐ.టి. మేలు అంటూ రైతుల్ని చావబాదాడు. ఇప్పటి ముఖ్యమంత్రి వ్యవసాయం పండగ అంటూనే భూముల్ని గుంజుకొని రైతుల్ని చావబాదు తున్నాడు.


సుబ్బలష్షిమి:

అయితే పైకి ఇద్దరూ వేర్వేరు మాటలన్నా, వెనకాల ఇద్దరు చేస్తోందీ ఒకటేనా బావా!


సుబ్బారావు:

జరుగుతున్నవి చూస్తుంటే తెలియటం లేదా మరదలా! ఏ సుత్తి అయినా ఒకటే గుండు పగలగొట్టటానికి!


************


3 comments:

  1. టపాకాయ లాంటి టపా.
    ఏ రాయి అయితే నేం పళ్ళు రాల గొట్టు కోడానికి!!
    :)

    ReplyDelete
  2. అన్ని సుత్తులు ఒకేలా ఉండవు...
    గుండు పగలాలంటే కొంచం పెద్ద సుత్తి కావాలి అందులోను ఇనప సుత్తి...
    ఈవిషయాన్ని రచయిత గమనించ గలరు

    ఇంకో పనిలేనివాడు

    ReplyDelete
  3. ఇలా మీలా నాలా పనిలేని వారు ఎన్నుకోవడాని ఆ పెద్దసుత్తి బరిలో తయ్యారండి. వెండితెరలు చించి ఇప్పుడు మనముందుకొస్తుంది. నా శిరస్త్రాణం ఎక్కడుందో వెదుక్కోవాలి నేను. అమ్మఓడిలో టపాకాయలకు కొదువలేనట్టుంది. పేల్చండి పేల్చండి.

    ReplyDelete