Sunday, January 18, 2009

13. వీధికుక్కలకి మహార్ధశ రానుందా?

[బహిరంగ ప్రదేశాల్లో బాంబుపేలుళ్ళని నివారించేందుకు వీధికుక్కలకి బాంబులు గుర్తించేలా శిక్షణనిస్తామన్న పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు – 06-01-‘ 09 డి.డి. వార్త నేపధ్యంలో]

సుబ్బారావు:
సుబ్బలష్షిమి! బహిరంగ ప్రదేశాల్లో, చెత్తకుండీల్లోనూ బాంబు పేలుళ్ళు జరక్కుండా వీధికుక్కలకి బాంబు డిటెక్షన్ చేసేలా శిక్షణ ఇస్తారట.

సుబ్బలష్షిమి:
పోనీలే బావా! అలాగన్నా పల్లెల్లో మనం చేసే కోర్ల పౌర్ణమి లాంటి పండగలు మళ్ళీ నగరాల్లోనూ వస్తాయేమో!

సుబ్బారావు: ఎంత స్పాలూ, బ్యూటీ పార్లర్లూ, హాస్పటళ్ళూ, ఫ్యాషన్ షోలతో పెంచినా సీమ కుక్కల కంటే, గుప్పెడన్నం పెడితే విశ్వాసం చూపించే వీధికుక్కలకి ఇప్పుడన్నా కాసిని మంచి రోజులొస్తాయోమో చూద్దాం మరదలా!

*********************

2 comments:

  1. :) కనీసం అవన్నా దేశ భక్తిని చాటుకుంటున్నాయి ..

    ReplyDelete
  2. నేస్తం గారూ,

    నా టపాకాయ కంటే మీ టపాకాయ బాగా పేలిందండీ!

    ReplyDelete