Friday, January 9, 2009

05.ఓడ మల్లయ్య – బోడి మల్లయ్య


సత్యం కంపూటర్స్ కుప్పకూలిన నేపధ్యంలో ఈనాడు [08/01/2009] 6 పేజీల నిండా ప్రచురించిన వార్తల నేపధ్యంలో


సుబ్బలష్షిమి:

చూశావా బావా! సత్యం కంపూటర్స్ మోసం గురించి ఈనాడులో 6 పేజీల నిండా వార్తలు వ్రాసారు. ఇది మరీ ఓవర్ గా లేదూ?


సుబ్బారావు:

అవును మరదలా. చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీ రావు కలిసే కదా సత్యం కంప్యూటర్స్ కి యమ సీన్ ఇచ్చారు? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం దండగ, చరిత్ర వృధా, అందరూ ఐ.టీ.నే చదవమన్నాడు కదా! హైటెక్ ముఖ్యమంత్రినంటూ సుడిగాలిలా ప్రపంచమంతా పర్యటనలు చేసి వచ్చాడు కూడా.


సుబ్బలష్షిమి:

మరి ఈరోజు సత్యం ద్రోహమనీ, అసత్యమనీ వ్రాసాడు? ఇవేవీ ఈ పత్రిక వాళ్ళకి ముందు తెలియదా?


సుబ్బారావు:

సత్యం రామలింగ రాజుకే కాదు, ఆ రోజు ఎన్.టి.రామారావుకీ సీన్ ఇచ్చాడు. తరువాత చంద్రబాబు నాయుడికి సీన్ ఇవ్వడానికి ఎన్.టి.రామారావుని డస్ట్ బిన్ లో పడేశాడు. తరువాత వై.యస్. కీ సీన్ ఇస్తూ చంద్రబాబునీ డస్ట్ బిన్ లో పడేశాడు. ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య అనటం, దాటాకా బోడి మల్లయ్య అనడం రామోజీ రావుకీ బాగా వచ్చిన టెక్నిక్! అంతే మరదలా!


****************

5 comments:

  1. Wonderful. chala baagaa cheppaaru!!!!!!!

    ReplyDelete
  2. సత్యం వ్యాసంలో నా అభిప్రాయాన్ని తెలియజేశాను. టపాకాయ బ్లాగ్లో కలర్ కంటికి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వీలయితే మార్చండి.

    ReplyDelete
  3. వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.
    jeevani garu: Background color change అవ్వడం లేదండి.

    ReplyDelete