Friday, January 30, 2009

24. పరమానందయ్య శిష్యులు – మంగుళూరు పబ్బ్ Vs శ్రీరామ సేన

[మంగళూరు పబ్బులో తాగితందనాలు ఆడుతున్న ఆడవాళ్ళు – వాళ్ళని జుట్టుపట్టుకు ఈడ్చి తన్నిన శ్రీరామసేనల గురించిన వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! చిన్నప్పుడు పరమానందయ్య గారి శిష్యులు కథ చదివాం, గుర్తుందా?

సుబ్బారావు:
ఏ కథ మరదలా!

సుబ్బలష్షిమి:
ఓ సారి గురువుగారు తన శిష్యుల్లో ఇద్దరికి తన కాళ్ళు వత్తమని చెబుతాడు. కాళ్ళు వత్తుతున్న శిష్యుల్లో ఒకడు రెండోవాణ్ణి ’నీ కాలు డొక్కుది. నా కాలు బంగారం’ అంటూ తాను ఒత్తుతున్న గురువు కాలును చూపుతాడు. రెండోవాడికి వొళ్ళుమండి ’నీ కాలే డొక్కుది – చూస్కో’ అంటూ గురువు కాలిని కొడతాడు. దెబ్బతో ఇద్దరు కలిసి గురువుగారి రెండు కాళ్ళనీ చితగ్గొడతారు. ఆ కథ.

సుబ్బారావు:
ఆ కథా! అవునూ, ఇప్పుడు ఆ కథెందుకు గుర్తొచ్చింది నీకు?

సుబ్బలష్షిమి:
ఏం లేదు బావా! మంగుళూరు పబ్బులో ఆడవాళ్ళు తాగి తందనాలాడారట. అందుకు ఆగ్రహించిన ’శ్రీరామ సేన’ వాళ్ళు ఆ ఆడవాళ్ళని తన్ని తగలేసారట. వెరసి ఆ ఆడవాళ్ళు, ఈ సేన వాళ్ళూ కలిసి జయప్రదంగా భారతీయ సంస్కృతినీ భ్రష్ఠు పట్టిస్తున్నారు గదా!

సుబ్బారావు:
అవును మరదలా! తాగి తందనాలడటమూ తప్పే, ఆడవాళ్ళని హింసించడమూ తప్పే! వెరసి మీడియా మాత్రం ఈ సంఘటనని చక్కగా ఉపయోగించుకుంటోంది! సెన్సేషన్ కి సెన్సెషన్, డబ్బుకి డబ్బు; దేశ సంస్కృతిని భ్రష్ఠుపట్టించే అవకాశానికి అవకాశమూ! లేకపోతే – సమాజ పెద్దగా కనీసం రెండువర్గాల తప్పు ఒప్పుల్నీ విశ్లేషించాలి గదా! ఆ పని మీడియా ఛస్తే చేయదు గాక చేయదు.

***********

3 comments:

  1. I object your honour. Its fundamentally right to have a drink and wrong to hit/abuse some body. It is also not civil to hurt someone. It can be anybody.. man or a woman. I object your ideas of criticising women (who booze..as u said) have acted against our cultural norms. Women-drinking is accepted in Indian mythology. Keeping it aside, why a drunk-man is morally Right according to Sriram Sena is not known.

    Women-beating is worse. It can be in public or between the walls (wife-beating is a good example) So I agree with your cross remarks on Sriramsena.

    Never mind. People will forget this incident by next week.

    ReplyDelete
  2. సుజాత గారూ,

    ఆడైనా, మగైనా, ఇంట్లో నాలుగ్గోడల నడుమైనా బయటైనా తాగి తందనాలాడటం తప్పే. ఈ రోజు దాదాపు అందరూ [అంటే చాలామంది] తాగు తున్నారు గనుక తప్పు ఒప్పు అయిపోదు. ఈ విషయాన్ని డి.వి. నరసరాజు గారు తన ‘మైనరు బాబు’ కథలో ఎంతో సున్నితమైన హాస్యంతో సహా వ్రాసారు. వీలయితే చదవండి. ఇకపోతే రామసేన అయినా సీతసేన అయినా, ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా, నాలుగోడల నడుమైనా, బయటైనా ‘కొట్టటం’ అన్నది అనాగరికమైన ప్రవర్తన.

    ఇకపోతే పురాణాల్లో ’తాగటాన్ని’ సమర్ధించారన్నారు. దానితో పాటే పురాణాలు ఇంకా చాలా విషయాలు సమర్ధించాయి. మనకి నచ్చినవి మాత్రం ఒప్పుకొని, మిగిలిన వాటిని మూర్ఖం అనో, దురాచరమనో అనటం సరైనది కాదు. ఎందులో నుండి అయినా మంచి తీసుకోవాలి, చెడు విస్మరించాలి కదా! మీరు మరో విషయం మరిచిపోయారు. పురాణాల్లో కచుని ఉపాఖ్యానం లో సురాపానం ఎంత అనర్ధదాయకమో చాలా విపులంగా శుక్రాచార్యుడి పాత్ర ద్వారా చెప్పబడుతుంది.

    మరో వారం పోతే జనాలందరూ ఈ గొడవ మరచిపోవచ్చేమో గానీ, ఇప్పుడు బుర్రల్లోకి దిగబడ్డ భావజాలపు బీజాలు మాత్రం మొలకెత్తి విషవృక్షాలుగా ఊడలు దిగుతాయి. అలా మొలకెత్తిన గతంలోని బీజాలే ఇప్పుడీ విషఫలాలని కాస్తున్నాయి.

    ReplyDelete