Sunday, January 11, 2009

07. ఓడలు బళ్ళూ – బళ్ళూ ఓడలు

[భీమ్ రావ్ బాడ బస్తీ వాసుల ఇళ్ళూ అర్ధరాత్రి నుండి తెల్లవారే లోపల పోలీసులూ, ప్రభుత్వాధికారులు కలిసి కుప్పకూల్చేసిన వార్త, దాని మీద హైకోర్టు విచారించటానికి అడ్వకేట్ కమీషన్ ను పంపగా పోలీసులు అడ్డుకున్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! 90 ఏళ్ళనుండి ఉంటున్న బస్తీ, కరెంటు, పట్టాలు, ఇంటిపన్నులూ కూడా ఉన్న బస్తీ! తెల్లవారే లోగా మొండిగోడలు మిగిలాయట. ఇక ఏది పక్కా ఆస్తి అనాలి? ఏది శాశ్వతం అనాలి?

సుబ్బారావు:
అంతే మరదలా! ఒకప్పుడు ప్రజలకోసం రాజకీయనాయకులూ, వాళ్ళ పార్టీలూ ఉండేవి. ప్రజలకోసం నాయకులూ త్యాగాలు చేసేవాళ్ళు. ఈ రోజు నాయకుల కోసం, పార్టీల కోసం ప్రజలు త్యాగం చేయాల్సి వస్తోంది.

సుబ్బలష్షిమి:
ఓడలు బళ్ళూ, బళ్ళు ఓడలూ అవడం అంటే ఇదేనా బావా?

సుబ్బరావు:
అవును మరదలా!
*****************

No comments:

Post a Comment