Saturday, January 10, 2009

06. ‘సమ్మె’ల దెబ్బ

[ఆయిల్ కంపెనీ అధికారుల సమ్మె, లారీల సమ్మెతో పెట్రోలు, సరుకుల రేట్లు మండిపోతున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:

ఇదేమిటి బావా? లారీల సమ్మెతో సరుకుల ధరలూ, ఆయిల్ కంపెనీ అధికారుల సమ్మెతో పెట్రోలు రేట్లూ బ్లాక్ మార్కెట్ లో భగ్గు మంటున్నాయి కదా?

సుబ్బారావు:
దీన్నే అవినీతి తీవ్రవాదం అంటారు మరదలా! రాజు తలుచుకొంటే దెబ్బలకి కొదవా? ఇలాంటి సమ్మెలు సృష్టించుకోకపోతే దోచుకొనే దెలాగ? దోచుకొన్న దాంట్లో వాటాలు గుంజుకునే దెలాగ?

సుబ్బలష్షిమి:
నాకు తెలీక అడుగుతాను, ఇంత డబ్బు ఏంచేసుకుంటారు బావా?

సుబ్బారావు:
పీత కష్టాలు పీతవన్నట్లు ఎవరి అవసరాలు వాళ్ళవి మరదలా! అధిష్టాన దేవతల నుండి ’రాజకీయ కెరీర్’ కొనుక్కోవలసిన అవసరం కొందరిది. అలాగే అధిష్టాన దేవతల అవసరాలు అధిష్టాన దేవతలవి. అంతే మరదలా!

*************

No comments:

Post a Comment