Sunday, February 28, 2010

ముస్లిం మనోభావాలని కించపరిస్తే అరెస్టులు - హిందూ మనోభావాలని కించపరిస్తే అవార్డులు

[>>>ఖురాన్ ను ఉద్దేశించి ఖమ్మం జిల్లాలో ఓ హేతువాది రాసిన పుస్తకంపై ఎంఐఎం ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను తిరస్కరించగా వారంతా నిరసన తెలిపారు. ముస్లింల మనోభావాలను గాయపరుస్తూ పుస్తకం రాసిన వ్యక్తిని అరెస్టు చేశామని, ఆ వ్యవహారం వెనక ఎవరున్నదీ విచారణ జరుగుతోందని సీఎం హామీ ఇవ్వడంతో మజ్లిస్ శాంతించింది. - ఈనాడు వార్త.

ఎం.ఎఫ్.హుస్సేన్ విషయంలో:
>>>దానిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందిస్తూ.. స్వదేశంలోకి రావడాన్ని వ్యతిరేకించబోమని, అయితే క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. హుస్సేన్ భారత్‌కు తిరిగి వస్తే పూర్తి స్థాయి భద్రత కల్పి స్తామని కాంగ్రెస్ పేర్కొంది. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఖురాన్ ని కించపరిచేటట్లు హేతువాద రచయిత, ఇన్నయ్య కాబోలు, ఏదో పుస్తకం వ్రాసాడట. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు గొడవ చేశారు. సదరు రచయితని అరెస్టు చేశామని సీఎం చెప్పాడు. మరీ... దశాబ్దాలుగా, హిందూ మత గ్రంధాలని కించపరుస్తూ విషవృక్షాలని వ్రాసిన రంగనాయకమ్మల దగ్గరి నుండీ, ఇటీవల ’ద్రౌపది’ వ్రాసిన యార్లగడ్డ ల వరకూ ఎవరినీ ఏమీ చెయ్యలేదేం బావా? ఏ భాజపా వాళ్ళూ అసెంబ్లీల్లో గానీ, పార్లమెంటులో గానీ, ఏ గొడవా చేయలేదుగా?

సుబ్బారావు:
గొడవ సంగతి దేవుడెరుగు మరదలా! ఏకంగా యార్లగడ్డకైతే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు సైతం ఇచ్చారు. దీన్ని బట్టి తెలియటం లేదా... ముస్లింలకి ఎం.ఐ.ఎం. అండ ఎంతో, భాజపా, కాంగ్రెస్ ల అండ కూడా అంతేనని!

Saturday, February 27, 2010

వీళ్ళందరినీ చూసి భారతీయులుగా మనం నిజంగా సిగ్గుపడాల్సిందే!

[>>>భారత ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు : ఎం.ఎఫ్.హుస్సేన్ కు ఖతార్ పౌరసత్త్వం ఇవ్వడాన్ని భారత్ లోని పలువురు ప్రముఖ కళాకారులు స్వాగతించారు. "అది ఆయనకు గొప్పగౌరవం" అని చిత్రకారిణి అంజోలి ఇలా మీనన్ అన్నారు. 95 ఏళ్ళ హుస్సేన్ నిజమైన కర్మయోగి అని ఆమె కితాబిచ్చారు. "స్వదేశంలో ఆయన్ను నీచంగా అవమానించారు. ఆయన విదేశీ పౌరసత్త్వాన్ని అంగీకరిస్తే.... నేను తప్పుపట్టను" అని ప్రముఖ సినీ దర్శకుడు శ్వామ్ బెనగల్ వ్యాఖ్యానించారు. - ఈనాడు వార్త నేపధ్యంలో

>>>దానిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందిస్తూ.. స్వదేశంలోకి రావడాన్ని వ్యతిరేకించబోమని, అయితే క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. హుస్సేన్ భారత్‌కు తిరిగి వస్తే పూర్తి స్థాయి భద్రత కల్పి స్తామని కాంగ్రెస్ పేర్కొంది. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పైవార్త చూశావా? హిందూ దేవతలని నగ్నంగా చిత్రించిన ఎం.ఎఫ్. హుస్సేన్ ’కర్మయోగి’ట. మరో ముస్లిం[నిజాం] పేరు పెట్టుకోవచ్చు గదా? పైగా అతడు స్వదేశం నుండి వెళ్ళిపోవాల్సి రావటం భారత ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటని ప్రముఖ సినీ దర్శకుడు శ్వాం బెనగల్ అంటున్నాడు.

సుబ్బారావు:
అందుకు కాదు మరదలా, భారతీయులు హిందువులు సిగ్గుపడాల్సింది! ఎం.ఎఫ్.హుస్సేన్ లాంటి వాళ్ళు ఈ దేశం లో పుట్టినందుకు, అతడికి మద్దతు తెలిపే శ్వాంబెనెగళ్ లాంటి వాళ్ళు ఉన్నందుకు సిగ్గుపడాలి. మీడియా వీళ్ళని ప్రముఖులని చేసి, వీళ్ళంతా వెలిగి పోయారు గానీ, అసలు రంగులు ఇప్పుడే వెలికి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ చూసి భారతీయులుగా మనం నిజంగా సిగ్గుపడాల్సిందే!

ఆరోపణలని ఉపసంహరించుకున్నంత మాత్రాన చెడు మంచి అయిపోతుందా!

[ఈనాడు వార్త: [26 Feb. 2010]
>>>తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇస్తూ రెండు టీవీ ఛానెళ్ళ అధినేతలపై చేసిన వ్యక్తిగత విమర్శలను ఉపసంహరించుకుంటున్నానని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు అమర్, మరోనేత అమరనాధ్ తో కలిసి గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పాత్రికేయుల సంఘం పెద్దలు చేసిన సూచన మేరకు వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటున్నానని కృష్ణమోహన్ పేర్కొన్నారు.

ఆంధ్రజ్యోతి వార్త: [24 Feb.2010]
>>>టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ రెండో వివాహం చేసుకున్నారని, ఎన్‌టీవీ అధినేత నరేంద్ర మొదటి భార్యను చంపారని కృష్ణమోహన్ ఆరోపించారు. వారు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నారు. 2003 నుంచి రవిప్రకాశ్ సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అలాగే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేంద్ర చేసిన అక్రమాలు, 300-400 ఎకరాల్లో దామాషా ప్రకారం 40% గ్రీన్‌బెల్ట్ ఉంచారా లేదా, తదితరాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రవిప్రకాశ్ దక్షిణాఫ్రికాలో 7 చానళ్లు పెట్టారని, దుబాయ్‌లో ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.
కారు డ్రైవర్‌గా జీవితం ఆరంభించిన నరేంద్ర చానెల్ అధిపతి అయ్యారని, వందల కోట్లు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. - పై వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆక్రమాల గురించి టీవీ9, NTV వాళ్ళు వార్తప్రసారాలు చేసారట. ఆ మీదట ఇతడు ఆ టీవీ అధినేతల అక్రమాలు, అనైతికతల గురించి ఆరోఫణలు చేశాడు. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుంటున్నానంటున్నాడు. అదీ పాత్రికేయుల పెద్దల సూచనల మేరకట.

సుబ్బారావు:
అంతే మరదలా! పాత్రికేయుల పెద్దల సూచనల మేరకు ఈ ఎమ్మెల్యే తన ఆరోపణలు ఉపసంహరించుకుంటాడు. రాజకీయ పెద్దల సూచనల మేరకు, ఆ టీవీ అధినేతలు ప్రసారాలు ఉపసంహరించుకుంటారు. దొంగలూ దొంగలూ బాహాటంగా ఊళ్ళు పంచుకుంటున్నారు. అంతే!

Friday, February 26, 2010

చక్కెర ధర 12.50 రూపాయలు

[చక్కెరను మన దేశం నుండి కిలో 12.50 ల వంతున ఎగుమతి చేసారు. అదే సమయంలో 36/- రూ. లకు దిగుమతి చేసుకున్నారు. దీని వల్ల చక్కెర కంపెనీలు ఒకేసారి 30 కోట్ల రూపాయల నుండి 901కోట్ల రూపాయల లాభాలకు ఎగబాకాయి. - పార్లమెంట్ లో సుష్మాస్వరాజ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మన దేశం నుండి చక్కెరను అంతతక్కువ రేటుకు [రూ.12.50] ఎగుమతి చేయటం ఎందుకు? మళ్ళీ అదే సమయంలో అంత ఎక్కువ రేటుకు[రూ.36] దిగుమతి చేసుకోవటం ఎందుకు?

సుబ్బారావు:
ఇదంతా మార్కెట్ మాయాజాలం మరదలా!మరి అందుకే కదా, స్విస్ బ్యాంకుల్లో మన వాళ్ళ డబ్బులు 79 వేల లక్షలకోట్ల రూపాయలు నల్లరంగులో దాక్కున్నాయి.

అనుభవం ఎక్కువైతే అవినీతి ఎక్కువవుతుందా?

[మహారాష్ట్ర, గోవా చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ మన్ జీత్ సింగ్ బాలీ 2 కోట్లరూపాయల లంచం తీసుకుంటూ సీబిఐ కి దొరికిపోయిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ బాలీ, తపాలా శాఖలో దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన అధికారి. అనుభవం ఎక్కువయితే అవినీతి కూడా ఎక్కువవుతుందా ఏం? 2 కోట్లరూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

సుబ్బారావు:
మామూలుగా అయితే అనుభవం ఎక్కువున్న అధికారులు ఉంటే, ఆ శాఖ ఎక్కువగా అభివృద్ది చెందుతుంది మరదలా! కాని ఇప్పటి రోజుల్లో అధికారుల అనుభవం ఎక్కువయితే, ఆ వ్యక్తుల అభివృద్ది ఎక్కువగా ఉంటోంది. అనుభవం పెరిగితే అవినీతి మార్గాలు బాగా తెలుస్తాయి కదా!

Wednesday, February 24, 2010

అసలు సిసలు ఈనాడు మార్కు జర్నలిజం!

[ఎమ్యెల్యే మార్కు లీజు అని హెడ్డింగ్ క్రింద ఈనాడు వార్త నేపధ్యంలో.

>>>న్యూస్ టుడే, హైదరాబాద్:
ఆయన తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే. ఆయనకు ఎన్నో విద్యాసంస్థలు, కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా, ఒక చిన్న స్థలంపై కన్నుపడింది. పార్కింగ్ కోసం కావాలంటూ ఆర్జీ పెట్టుకున్నారు. తన భార్య పేరిట అత్యంత చవకగా 30 ఏళ్ళపాటు లీజుకి పట్టేశారు. ఎమ్యెల్యే ఒత్తిడికి తలవంచిన అధికారులు దాదాపు కోటి రూపాయల విలువైన స్థలాన్ని నెలకు రూ.1500 రుసుముతో ధారాదత్తం చేశారు. ఈ అక్రమం వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో పాత హుడా లేఆవుట్ లో 350 గజాల స్థలం ఉంది. గతంలో ఇక్కడ పురాతన బావి ఒకటి ఉండేది. దీన్ని క్రమంగా పూడ్చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో... నగరంలో అధికార పక్షానికి వెన్నుదన్నుగా ఉండే పార్టీ నుండి గెలిచిన ఓ ఎమ్యెల్యే ఈ స్థలంపై కన్నేశారు. స్థలాన్ని పార్కింగ్ కు ఉపయోగించుకుంటామని, లీజుకి ఇవ్వమని కొన్నిరోజుల కిందట హైదరాబాద్ మహానగరాభివృద్ది సంస్థ [హైమా] అధికారులను కోరారు. ఆరునెలల క్రిందట ఆ స్థలాన్ని ఇచ్చారు. అయితే పార్కింగ్ కి వినియోగించుకోకుండా చుట్టూ గొడకట్టి ఆ స్థలాన్ని ఎమ్యెల్యే తన ఆధీనంలో ఉంచుకున్నారు...... ఓ ఉన్నతాధికారి మాత్రం ఎమ్యెల్యే లీజు విషయం చాలా చిన్న వ్వవహారమని తేలికగా కొట్టేయటం గమనార్హం. - ఈ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు ఈనాడులో వచ్చిన ’పై వార్త’ చదివావా? హైదరాబాద్ నగరంలో అధికారపక్షమైన కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా ఉండే పార్టీ ఏది, ఎంఐఎం గాక! అదే డైరెక్టుగా వ్రాయవచ్చు గదా ఈనాడు? ఎమ్మెల్యే పేరు చెప్పకుండా, అతడి పార్టీ పేరు కూడా ఇంత డొంక తిరుగుడుగా ఎందుకూ చెప్పడం?

సుబ్బారావు:
అదే మరి అసలు సిసలు ఈనాడు మార్కు జర్నలిజం మరదలా! అన్ని వివరాలు తెలిసిన పత్రిక వారికి, ఎమ్మెల్యే పేరేమిటో, నియోజక వర్గమేమిటో, ఆ విద్యాసంస్థల వివరాలేమిటో తెలియవా? ఈ లోపున బేరం కుదుర్చుకోమని, సదరు ఎమ్మెల్యేకి ఈనాడు ఓ హెచ్చరిక ఇస్తోందన్న మాట. అప్పటికీ ఎమ్మెల్యే దిగిరాకపోతే రేపట్నుండి పేరూ, ఇతర వివరాలతో, వైనవైనాలుగా అతడి ఇతర అక్రమాలు కూడా బయటపెడతారు. అదీ అసలు సంగతి!

ఆయనే ఉంటే... వాడితో పనేమిటి? అన్నట్లు!

[స్విస్ బ్యాంకుల్లో రహస్య ఖాతాల వివరాలు తెలుసుకోగోరే ఏ దేశమైనా, సదరు ఖాతాదారుని పేరు, బ్యాంకు, తదితర వివరాలను ఇవ్వాలని స్విస్ బ్యాంకుల సంఘం నిబంధన ప్రకటించిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! స్విస్ బ్యాంకుల్లో రహస్యంగా సొమ్ముదాచుకున్న వాళ్ళు.... ఏ పేరుతో, ఏ బ్యాంకుల్లో, ఎంత సొమ్ము దాచారో తెలిస్తే, దాన్ని ’రహస్యంగా దాచుకోవడం’ అని ఎందుకంటాం? ఇంకా నయం, అకౌంటు నంబరు, ఖాతాదురుని ఫోటో కూడా ఆడిగారు కాదు! రహస్య ఖాతాదారు పేరు వివరాలు చెబితే తప్ప ఖాతా వివరాలు చెప్పమన్నారట తెలుసా?

సుబ్బారావు:
’ఆయనే ఉంటే... వాడితో పనేమిటి?’ అని సామెత! అలావుంది ఈ స్విస్ బ్యాంకుల వరస!

సుబ్బలష్షిమి:
అంటే - వెరసి, రహస్య ఖాతాలు వెల్లడించం అని చెప్పకనే చెబుతున్నారన్నమాట. కదూ బావా!

Monday, February 22, 2010

సంతకాలు చేస్తే ధరలు తగ్గుతాయా?

[అధిక ధరల మీద అందోళన చేయడానికి భాజపా సంతకాల సేకరణ చేస్తుంది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అధికధరల మీద భాజపా సంతకాలు సేకరించి ఆందోళన చేస్తుందట. సంతకాలు సేకరిస్తే ధరలు తగ్గుతాయా?

సుబ్బారావు:
ఒకప్పుడు అలాంటి మూవ్ మెంట్స్ ప్రభుత్వాలని కదిలించేవి మరదలా! ఇప్పటి ప్రభుత్వాలకవి దున్నపోతుమీద కురిసిన వర్షాల్లాంటివి.

సుబ్బలష్షిమి:
నిజంగా సంతకాలు పెడితే ధరలు తగ్గేటట్లయితే జనాలంతా వందలూ వేలూ సంతకాలు పెట్టకపోదూరా?

దాడులు చేస్తుంటే, విడిపోతామంటూ ఏకాభిప్రాయానికి రాక ఛస్తరా...?

[ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణా అయినా, సమైక్యాంధ్ర అయినా... చిదంబరం.
తెలంగాణా పరిధిలోని బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు దాడులు చేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణాను అడ్డుకునే వారి ఆస్తులు లెక్కకడుతున్నాం - ఐకాస కన్వీనర్ కోదండరాం. - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఓ ప్రక్క హోమంత్రి చిదంబరం, ఏకాభిప్రాయం తర్వాతే ఏదైనా అంటున్నాడు. మరోప్రక్క సీమాంధ్ర ఉద్యోగులపై దాడులని ఎవరూ కట్టడి చేయటం లేదు. ఇలా తన్ని తగలేస్తే ’విడిపోతాం బాబోయ్!’ అంటూ ఏకాభిప్రాయానికి రాక ఛస్తారా?

సుబ్బలష్షిమి:
మరి అందుకే గదా మరదలా, తెరాస, కోదండ రాంలు సీమాంధ్ర ప్రజలు ఏకాభిప్రాయానికి రావటం కోసం కృషి చేస్తున్నారు. పొమ్మని పొగ బెట్టాక, ఇంకా పోకపోతే తిట్టి కొట్టే దాకా పోతే, పోకేం చేస్తారు, ఏకాభిప్రాయానికి రాకేం చేస్తారని వాళ్ళ ధీమా!

బాగానే గిట్టుబాటవుతుంది మరి!

[అన్ని విభాగాల్లోకి లాభాలు వచ్చేది దక్షిణ మధ్య రైల్వేలో - లాభాలు వస్తాయని సర్వే నివేదికలు వచ్చిన చోట గాకుండా, నష్టాలు వస్తున్న మార్గాల్లోనే కొత్త రైళ్ళు వేయటం - ఇప్పటికి సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్లలో నడుస్తున్న ప్రక్రియ - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అందరిలోకీ తెలుగు వాళ్ళే ఎక్కువగా టిక్కెట్టు కొనుక్కుని మరీ ప్రయాణం చేస్తారు కాబోలు. దక్షిణ మధ్య రైల్వేకే లాభాలెక్కువట. అయినా సరే! లాభాలొచ్చే చోట గాకుండా, ఇప్పటికీ నష్టాలొస్తున్న మార్గాల్లోనే కొత్త రైళ్ళెందుకు వేస్తారు బావా?

సుబ్బారావు:
మరి అలా చేస్తేనే కదా మరదలా! కొన్నాళ్ళకి నష్టాలు తప్ప లాభాల్లేకుండా పోయేది? అప్పుడెంచక్కా నష్టాలొస్తున్నాయని చెప్పి అమ్మేయొచ్చు. ప్రైవేటీకరించవచ్చు. అప్పుడు వాళ్ళకు లాభాల పంటలు పండుతాయి. దేశం గతేమైనా, తమకి మాత్రం బాగానే గిట్టుబాటవుతుంది మరి!

సారాతాగి చచ్చిపోతే సమాజాన్ని ఉద్దరించినట్లా!

[ సారా మృతుల కుటుంబానికి 5 లక్షల పరిహారమివ్వాలి - చిరంజీవి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సారా తాగి మరణించిన వారి కుటుంబాలకి ఐదు లక్షల రూపాయల పరిహారమివ్వాలని ప్రరాప నేత చిరంజీవి అంటున్నాడు. ఈ సారా వ్యసనపరులకి తమ మీద తమకి శ్రద్దా లేదు, తమ కుటుంబాల పట్ల బాధ్యతా లేదు. అలాంటి వాళ్ళు, సారా తాగి చచ్చిపోతే ప్రభుత్వం పరిహారమివ్వాలట. ఇదెక్కడి అడ్డదిడ్డపు రాజకీయం బావా!?

సుబ్బారావు:
ప్రభుత్వమే అడ్డదిడ్డంగా రాజకీయ వ్యాపారం, సారా వ్యాపారం చేస్తున్నప్పుడు, అన్నీ అడ్డదిడ్డంగానే ఉంటాయి మరదలా! వాళ్ళ వ్యసనం కొద్దీ వాళ్ళు, తాగి తాగి ఛస్తే... అదేదో ప్రజలనుద్దరించి చచ్చినట్లు పరిహారం ఇవ్వాలంటారు. అంతే!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అటు స్వాతంత్ర సమర యోధులకైతే అతీగతీ లేదు గానీ....

Sunday, February 21, 2010

విద్యార్ధుల నుండి టీచర్లకి, టీచర్ల నుండి విద్యార్ధులకి రక్షణ లేకుండా పోయిందా?

[34సంవత్సరాల టీచర్, 13 సంవత్సరాల విద్యార్ది మధ్య ప్రేమ కథ చిత్రం ’హైస్కూల్’ ని విడుదల కాకుండా నిషేదించాలని కర్నూలు రవీంద్ర విద్యాసంస్థ వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.- వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న వరంగల్ లో టీచర్, విద్యార్ది ఇద్దరు కలిసి లేచిపోయి పెళ్ళి చేసుకున్నారు. దెబ్బతో స్కూల్ వాళ్ళకి భయమేసినట్లుంది. అందుకని అలాంటి కధాంశంతో నిర్మిస్తున్న ’ హైస్కూల్’ చిత్రాన్ని నిషేధించాలని, ఇలాంటి చిత్రాలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయని, కర్నూలు రవీంద్ర విద్యాసంస్థ వారు కేసు వేశారు.

సుబ్బారావు:
మరంతే మరదలా! లేకపోతే ఇలాంటి సినిమాలు చూసిన విద్యార్ధుల నుండి టీచర్లకి, టీచర్ల నుండి విద్యార్ధులకి రక్షణ లేకుండా పోతుంది. ఇప్పటి వరకూ మగ టీచర్ల నుండి విద్యార్ధినిలకు రక్షణ లేదనుకుంటే, ఇప్పుడు ఆడ టీచర్ల నుండి విద్యార్ధులకు రక్షిణ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, సినిమా మాయాజాలం!?

Friday, February 19, 2010

ప్రజలు రాజకీయాల్లో అవినీతినీ, కులతత్వాన్ని పట్టించుకోవటం లేదా?

[కలల్లో విహరింపజేయలేను - శేఖర్ కమ్ముల వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! శేఖర్ కమ్ముల తన కొత్త సినిమా ’లీడర్’ విడుదల సందర్భంగా ఈనాడుకి ఇంటర్యూ ఇచ్చాడు. అందులో

>>>ఈనాడు:
ఈ చిత్రంలో ఏ పక్షాన్ని సమర్ధించారు?

శేఖర్ కమ్ముల:
ఒక పార్టీనో... ఎవరో ఓ వ్యక్తినో విమర్శించడం గానీ, సమర్ధించటం గానీ చేయలేదు. మన వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపించాను. అవినీతి, కులతత్వం లేని రాజకీయాలు అవసరమని ప్రస్తావించాను.

ఈనాడు:
మీరన్న రెండు అంశాల్నీ ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదే?

మొత్తానికి... ’ఈనాడు’ ప్రజలు రాజకీయాల్లో అవినీతినీ, కులతత్వాన్ని పట్టించుకోవటం లేదని స్టాంపు కొట్టేస్తూంది. చూశావా?

సుబ్బారావు:
మరి మీడియా చేస్తోంది అదే గదా మరదలా! ఓ ప్రక్క ప్రజలు "ఇదెక్కడి అవినీతిరా బాబోయ్!" అని మొత్తుకుంటుంటే, "అదేం లేదు. మీకసలు ఏవీ పట్టటం లేదు" అని ’ఈనాడు’ మాస్ హిప్నాటిజం చెయ్యాలని ఫీట్లు చేస్తోంది! లేకపోతే జనాలు పట్టించుకోకుండానే ఇన్ని కుల సంఘాలున్నాయా?

Wednesday, February 17, 2010

తెరాస గురి తెలంగాణా మీదా లేక తెదేపా పైనా....?

[నాగం! పదవంటే అంత మోజెందుకు? - హరీశ్ రావు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెరాస నేత హరీశ్ రావ్, తెదేపా నేత నాగం జనార్ధన రెడ్డిని పదవంటే అంత మోజెందుకు అని అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న జానారెడ్డిని, మిగిలిన కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.లని అడగడేం?

సుబ్బారావు:
అదే మరి మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మరదలా! తెరాస గురి తెలంగాణా మీద కాదు, తెదేపా పైనే అన్నట్లుంది వ్యవహారం. లోగుట్టు పెరుమాళ్ళకి తెలియాల్సిందే!

ప్రజాస్వామ్యాన్ని నమ్మని నక్సలెట్లు ఈ దేశపౌరులా?

[నక్సలైట్లు దేశానికి శత్రువులు కాదు. వారూ మన దేశ పౌరులే - సుప్రీం కోర్టు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నక్సలైట్లు దేశాన్ని రక్షించే జవాన్లని చంపేస్తూ ఉంటారు. విదేశీ తీవ్రవాద సంస్థలతో రహస్య ఒప్పందాలు చేసుకుని ఆయుధాలు సమీకరిస్తూ ఉంటారు. చట్టాలని లెక్కచెయ్యకుండా హింసలు చేస్తుంటారు. కోర్టులకి సమాంతరంగా ప్రజాకోర్టులు నిర్వహించి చావకొడుతుంటారు. తుపాకీ గొట్టమే సమస్తం అంటూ ప్రజాస్వామ్యాన్ని అసలు పట్టించుకోరు. మరి వీళ్ళని ఈ దేశ పౌరులే అంటుందే సుప్రీంకోర్టు?

సుబ్బారావు:
నక్సలైట్లు తమని తామే ఈ దేశపౌరులుగా పరిగణించుకోవటం లేదు. దేశపు గతీ పట్టించుకోవటం లేదు. తమకి డబ్బు డంపులు భారీగా ఉంటే చాలు! అలాంటి వాళ్లని గురించి సుప్రీం కోర్టు ఇలా అంటోందంటే, ఏ ప్రణాళికకు ముందస్తు ప్రస్తావనలో ఇవి?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! పడ్డాక తెలుస్తాయి దెబ్బలన్నట్లు! ముందుగా ఎవరమైనా ఏం ఊహించగలం?

ఇదీ రెడ్ టేపిజం మార్క్ అంటే!

[స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, 10 మంది తెరాస ఎమ్మెల్యేల రాజీనామాలు, ఒక తెదేపా ఎం.ఎల్.ఏ. రాజీనామా, ఒక భాజపా ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రం పెండింగ్ లో పెట్టిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంతో నైపుణ్యంగా, పదిమంది తెరాస, ఒక తెదేపా, ఒక భాజపా ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించేసాడు. కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.లు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ముత్యంరెడ్డిల రాజీనామాలు మాత్రం అంగీకరించలేదు. ఎంచేతంటావ్?

సుబ్బారావు:
అంత స్పష్టంగా కనబడుతుంటే ఎందుకంటావేమిటి మరదలా! కాంగ్రెస్ అధిష్టానం రాంరెడ్డి దామోదర్ నీ, ముత్యం రెడ్డినీ నయానో భయానో వెనక్కి తీయించే ప్రయత్నాలు చేస్తూనే ఉంది కదా! అందుకు తగినంత సమయం కావాలి కాబట్టి వాళ్ళ రాజీనామాలు పెండింగ్ లో ఉంచాడు. అదీ రెడ్ టేపిజం మార్క్ అంటే!

Tuesday, February 16, 2010

జవాన్ లని చంపితే విప్లవం వస్తుందా?

[బెంగాల్లో మావోయిస్టుల మెరుపుదాడి - 24 మంది జవాన్ల బలి - ఇది మా పనే - [కోటేశ్వరరావు అలియాస్] కిషన్ జీ, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మావోయిస్టులు ’తుపాకి గొట్టం తోనే విప్లవం వస్తుందనీ’, తాము ’ప్రజల కోసం పోరాడుతున్నామనీ’ అంటారు కదా! మరి శతృదేశాల నుండి దేశాన్ని కాపాడే జవాన్లని చంపటం ద్వారా విప్లవం ఎలా వస్తుంది? ప్రజల కోసమే పోరాడినట్లు ఎలా అవుతుంది?

సుబ్బారావు:
మావోయిస్టులు నిజంగా విప్లవకారులూ కాదు, ప్రజల కోసం, దేశం కోసం నిజంగా జ్వలించిపోవటమూ లేదు మరదలా! కాబట్టే మావోయిస్టులు జవాన్లనీ, పోలీసుల్ని చంపుతుంటారు. ప్రజల ఆస్థుల్ని ధ్వంసం చేస్తుంటారు. పొరపాటున కూడా... బ్లాక్ మార్కెటీర్ల, భారీగా అక్రమార్జనలు చేసి వందలేసి కోట్ల కూడబెట్టిన బ్యూరాక్రాట్ల, రాజకీయ నాయకుల జోలికిపోరు. కార్పోరేట్ వ్యాపారుల ఆస్థుల జోలికి అంతకంటే పోరు. వాటాలొస్తాయి మరి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అందుకే కాబోలు, మాజీ నక్సల్స్ దందాలు చేస్తూ, ప్రైవేటు సెటిల్ మెంట్లు చేస్తూ బ్రతికేస్తున్నారు. బహుశః మాజీ నక్సల్ అంటూ జనజీవన స్రవంతిలో కల్సిపోవటం అంటే రిటైర్ మెంట్ లైఫ్ ఏమో? ఏవిధంగా చూసిన వీళ్ళ వలన ప్రజలకే నష్టం, కష్టం!

Saturday, February 13, 2010

ఓ వైపు ఆర్పేస్తూ - మరో వైపు ఆరనీయ వద్దని నీతులు!

[ఆదర్శ జ్యాలను ఆరనీయకండి - రామోజీరావు పిలుపు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సమాజానికి మంచి చేయాలనే ఆదర్శంతో పోలీసు శాఖలో చేరి ఇక్కడ శిక్షణ పొందుతున్న యువకులు ఆ ఆదర్శజ్వాలను ఆరనీయకుండా చూడాలని ఈనాడు రామోజీరావు పిలుపునిచ్చాడు, తెలుసా?

సుబ్బారావు:
పాపం! సమాజానికి మంచిచేయాలనే ఆదర్శంతోనే యువకులు మీడియా రంగంలోకీ వస్తారు కదా! వాళ్ల ఆదర్శజ్వాలను ఆర్పేస్తున్నప్పుడు, అసలు జ్వాలనే రగలనీయకుండా అణిచేస్తున్నప్పుడు ఈ నీతులన్నీ గుర్తుకు రాలేదేమో ఈ గురివిందగింజకి?

సుబ్బలష్షిమి:
భలేవాడివి బావా! ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు కాని, తాము ఆచరించేందుకు కాదని వాళ్ళెప్పుడో ఫిక్సయి పోయారు.

Friday, February 12, 2010

చక్కెర తినకపోతే చావరు గాని, సినిమా చూడకపోతే ఛస్తారు కాబోలు!

సుబ్బలష్షిమి:
బావా! మొన్న తెలంగాణా జిల్లాలలో ’అదుర్స్’ సినిమా ప్రదర్శన కోసం ధియేటర్లకు పోలీసుల రక్షణ కల్పించారు. ఇప్పుడు ముంబైలో షారుఖ్ ఖాన్ సినిమా ’మై నేమ్ ఈజ్ ఖాన్’ కూ అదే స్థితి. ఇంతకూ పోలీసుల కర్తవ్యం, చివరకి సినిమా ప్రదర్శనలని రక్షించటం అయిపోయిందా?

సుబ్బారావు:
అవును మదరలా! చక్కెర తినకపోతే ఎవరూ చావరు గానీ, ’సినిమాలు టీవీలు చూడకపోతే మాత్రం ప్రాణాపాయ స్థితి’ అన్నట్లుంది వ్యవహారం. సినిమాలు కూడా ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు కదా! ఆర్దిక వ్యవస్థ పటిష్టతకు తప్పదు మరి!

సుబ్బలష్షిమి:
లోపం ఎక్కడుందో గాని... మొత్తానికి కొత్తకొత్త నిర్వచనాలు, సిద్దాంతాలు, పరిస్థితులూ పుడుతున్నాయి బావా!

Thursday, February 11, 2010

నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలట!

సుబ్బలష్షిమి:
బావా! రాజకీయాల్లోకి నిజాయితీ పరులు రావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు అంటోంది విన్నావా?

సుబ్బారావు:
అందుకే కాబోలు మరదలా! పీవీజీ లాంటి నిజాయితీపరులని పార్టీ నుండి తరిమేసింది. ఎన్డీ తివారీ ల్లాంటి వాళ్ళకి పదవులు కట్టబెట్టింది. వాళ్ళ కేసుల్నీ మాయం చేస్తుంది. చూడు, రాజ్ భవన్ లో తివారీ కామక్రీడల కేసు గురించి ఎక్కడైనా ఊసన్నా ఉందేమో! పైగా నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలంటూ స్టేట్ మెంట్లు ఇస్తుంది. ఎంతైనా ప్రభావశీల మహిళ కదా!?

సుబ్బలష్షిమి:
’చెప్పేవి నీతులు - తీసేవి గోతులు’ అంటే ఇవే కాబోలు బావా!

అవసరమనే సాకుతో ఏ ఒక్కరు మరొకరికి అన్యాయం చేయకూడదు!

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు జిల్లా ఎడిషన్లో ఈ సూక్తి చదివావా? ’అవసరమనే సాకుతో ఏ ఒక్కరు మరొకరికి అన్యాయం చేయకూడదు’ అన్నాడట ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్.

సుబ్బారావు:
అవును మరి, రెండవ ప్రపంచయుద్దంలో జపాన్ మీద అణు బాంబులు వేసిన అమెరికా అధక్షుల కంటే అర్హులెవరు ఇలాంటి సూక్తులు చెప్పటానికి!

సుబ్బలష్షిమి:
దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే కాబోలు బావా!

Wednesday, February 10, 2010

మానవహక్కుల సంఘాలున్నది నేరగాళ్ళ హక్కుల్ని రక్షించటానికే!

[కార్పోరేట్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ క్రింద, మహిళల గర్భాశయానికి అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేయటం - మహిళల భౌతిక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో గర్బాశయానిది కీలక పాత్ర - ఆ కారణంగా గర్భసంచిని తొలిగించటమంటే ఆ మహిళను జీవిత చరమాకంలోకి బలవంతంగా నెట్టడమే - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నాకో సందేహం మానవహక్కుల సంఘాల వాళ్ళు కొన్ని విషయాల్లో సుమెటోగా కేసులు తీసుకుంటారు కదా! మరి కార్పోరేట్ ఆసుపత్రులలో అమాయక మహిళా రోగులకి, అనవసరంగా గర్భకోశం తొలిగించే ఆపరేషన్లు చేసి, డబ్బు గుంజుతున్నారన్న విషయంపైన సుమెటోలు స్వీకరించరెందుకని?

సుబ్బారావు:
ఓసి అమాయకురాలా! మానవహక్కుల సంఘాలున్నది నేరగాళ్ళ హక్కుల్ని రక్షించటానికే! ఆర్ధిక నేరగాళ్ళతో సహా! అలాంటి చోట కార్పోరేట్ ఆర్ధిక నేరగాళ్ళ జోలికి వెళ్తారేమిటీ!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! నేరస్తుల హక్కుల పరిరక్షణ కోసమే ఇలాంటి వాళ్ళు పనిచేస్తుంటారు.

ఆర్ధిక వేత్త, మన ప్రధానమంత్రి కి ఇంగిత జ్ఞానం లేదా?!

[ధరలు దిగిరావాలంటే... - ముఖ్యమంత్రుల సదస్సులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వార్త నేపధ్యంలో]

>>>టోకు ధరలకు, చిల్లర ధరలకు చాలా వ్యత్యాసముంటోంది. మనకు చాలా పోటీ అవసరం. అందుకే చిల్లర అంగళ్ల రంగంలో వాణిజ్యాన్ని ఆహ్వానించే అంశాన్ని మనం గట్టిగా పరిశీలించాలి.

సుబ్బలష్షిమి:
బావా! మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రపంచ ప్రసిద్ద ఆర్ధిక వేత్త్త కదా? మరి, చిల్లర అంగళ్ళ రంగంలో పోటీ అవసరం, అప్పుడే ధరలు దిగొస్తాయి అంటాడేమిటి? అందరూ సిండికేట్ అయ్యి, అక్రమ నిల్వలుంచి, నల్ల బజారు విక్రయాలు జరుపుతుండ బట్టి కదా ధరలు పెరుగుతున్నాయి? సిమెంట్ కంపెనీలు ఈ విషయాన్ని చాలాసార్లు నిరూపించాయి కదా! ఈ ప్రభుత్వమే చాలా సార్లు సిమెంట్ కంపెనీలు సిండికేట్ అయితే ఊరుకోమని చెప్పింది కూడా! ఈ ఆర్ధిక వేత్తకి ఇంగిత జ్ఞానం [comman sense] తక్కువైనట్లుంది కదూ!

సుబ్బారావు:
కాదు మరదలా! స్వార్ధ పరిజ్ఞానం ఎక్కువైంది. కావాలంటే అదే శీర్షికలోని మరో పేరా చూడు.

>>>ధరలు దిగి రావాలంటే ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.

సుబ్బలష్షిమి:
అంటే ఇక భారతదేశంలో కిరాణా దుకాణాలు కూడా విదేశీ సంస్థల చేతికి ఇవ్వాలనా? అప్పుడు ధరల దిగొస్తాయా?

సుబ్బారావు:
మరందుకే గదా మరదలా! మిశ్రమ ఆర్ధిక వ్యవస్థని తుంగలో తొక్కి, ప్రభుత్వరంగ సంస్థలన్నిటిని వరసబెట్టి అమ్మి పారేస్తోంది? నిన్న NTPC ని కూడా అదే బాటన తోలేసారు.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఈ ఆర్దిక వేత్తకి ఇంగిత జ్ఞానం లేకపోవటం కాదు. ఇల్లుదోచి ఇతరులకి పెట్టే జ్ఞానం పుష్కలంగా ఉంది. అది తెలుసుకోలేకపోవటం మన అజ్ఞానం, అంతే!

Monday, February 8, 2010

అడుక్కు తినేవాళ్ళలాగా నటించండి[మారేశం] - అప్పుడు దాడులు జరగవు

[పేదల్లా కనబడితే దాడులు జరగవు - విక్టోరియా పోలీస్ ఛీఫ్ సైమన్, సమర్ధించిన విక్టోరియా ప్రధాని ... వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధులపై జరుగుతున్న దాడులు గురించి విక్టోరియా ఛీఫ్ సైమన్ అనే ఆసామి ’పేదల్లా కనబడితే దాడులు జరగవు’ అన్నాడట. దాన్ని విక్టోరియా ప్రధాని కూడా సమర్ధించాడట తెలుసా?

సుబ్బారావు:
ఇంకా నయం మరదలా! ’అడుక్కుతినేవాళ్ళ లాగా నటించండి[అంటే మారేశం అన్నమాట], అప్పుడు దాడులు జరగవు’ అన్నాడు కాదు.

సుబ్బలష్షిమి:
చూడబోతే ఏ దేశంలో అయినా... అధికారులూ, రాజకీయ నాయకులూ ఒకేలాగా ఉన్నట్లున్నారు బావా! సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళే, అదేమీ చెయ్యకుండా తీరికూర్చుని ఉచిత సలహాలిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్ విఫలమైనట్లుంది!

చక్కెర తినకపోతే ఎవరూ చావరు!

[చక్కెర తినకపోతే ఎవరూ చావరు - ఎన్సీపీ పార్టీ పత్రిక ’రాష్టవాది’ సంపాదకీయం - వార్తనేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎన్సీపీ పార్టీ పత్రిక రాష్ట్రవాది ’చక్కెర తినకపోతే ఎవరూ చావరు’ అంటుంది. పాపాయిల పాలల్లోకి సైతం చక్కెర కావాలి. కాఫీ టీలు లేనిది రోజు గడవదు చాలామందికి. వాళ్ళంతా ఏం కావాలి?

సుబ్బారావు:
ఇంకా నయం "అన్నం తినకపోతే ఎవరూ చావరు" అనలేదు సంతోషించు మరదలా!

సుబ్బలష్షిమి:
ఏమోలే బావా! రేపెప్పెడో అన్నా అంటారేమో. ఇంకా ఇలాగే సాగితే "ఆ! ఛస్తే ఛస్తారు. అయితే ఏమిటట?" అని కూడా అంటారేమో! ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో మంత్రి పదవులు, ఆదాయ వనరులూ అనుభవిస్తున్నారు. గుట్టు చప్పుడు గాకుండా తమ జీత భత్యాలు, ఇతర అలవెన్సులూ పెంచుకుంటున్నారు. బంధుమిత్రులకి సైతం, వివరాలడక్కుండా, ఎంత మందికైనా విమాన ప్రయాణ ఛార్జిలలో భారీ రాయితీలు మొన్నామధ్యనే కల్పించుకున్నారు. అదే ప్రజలకైతే "చక్కెర తిననంత మాత్రానా ఎవరూ ఛావరు" అని చెబుతున్నారు. ఏమనాలి బావా వీళ్ళనీ!

సుబ్బారావు:
రాజకీయ నాయకులనే అనాలి మరదలా! మరే జంతువుతోనైనా, వస్తువుతోనైనా పోల్చితే వాటిని అవమానించినట్లే!

ధరల పెరుగుదల - కొత్త నిర్వచనాలు

[ధరల పెరుగదలకు ప్రజల కొనుగోలు శక్తే కారణం - పవార్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రజల కొనుగోలు శక్తి ఎక్కువై, తెగ కొని పారేస్తున్నారట. అందుకే ధరలు పెరిగాయట. ఎన్సీపీ నేత, కేంద్ర ఆహారశాఖ మంత్రి శరద్ పవార్ సూత్రీకరించాడు. మొన్నామధ్య అమెరికా అప్పటి అధ్యక్షుడు బుష్ కూడా ఇదే కదూ అన్నాడు, భారతీయులు తెగ తినేస్తున్నానారనీ, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్ధాల ధరలు పెరిగాయని?

సుబ్బారావు:
అవును మరదలా! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మాంద్యం వచ్చి ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గింది అని, దాని పర్యవసానంగా పన్నుల వసూళ్ళు కూడా తగ్గాయని ఒకసారి చెప్పారు. కరువు, వరదలు వలన పంటలు బాగా పండలేదని ఒకసారి చెప్పారు. గత సంవత్సరం కంటే పంటల ఉత్పత్తి శాతం పెరిగిందని మరో సారి చెప్పారు. మళ్ళీ అదే పవార్ లు, కేంద్రప్రభుత్వాలు, ఐరాసలు, ప్రజలలో దారిద్రరేఖకు దిగువనున్న వారి శాతం 40% కి పైగా పెరిగిందని అన్నారు. అంతేకాదు, ధరలు డిమాండ్ - సప్లై సూత్రాన్ని అనుసరించి ఉంటాయనీ అంటారు. అదే చిత్రం మరి! ఏది నిజమో ఎవరికీ అర్ధం కాదు.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఇంత అలవోకగా నాలుక తిప్పగలరు కాబట్టే పవార్ ని ఒకప్పుడు మీడియా, కేంద్రంలో నెం.2 స్థానంలో ఉన్నాడనీ, రేపో మాపో ప్రధాని అయిపోతాడనీ తెగ పొగిడి పారేసింది.

సుబ్బారావు:
ఓహో! అయితే అవసరాన్ని బట్టి, అవసరమైన భాష్యం చెప్పగలిగితే, వాళ్ళని మీడియా పొగిడి పారేస్తుంది కాబోలు మరదలా?

ఇదిగో ధరలు తగ్గుతాయట - అదిగో తగ్గేసాయట!

[ధరలపై కళ్ళెం వేసాం. కొద్ది వారాల్లో ఫలితాలు కనబడతాయి, ముఖ్యమంత్రుల సమావేశంలో - ప్రధాని మన్మోహన్ సింగ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ధరలకు కళ్ళెం వేసారట. ఫలితాలు కనబడటానికి కొద్దివారాలు పడుతుందంటున్నారు మన్మోహన్ సింగ్!

సుబ్బారావు:
ఎన్ని వారాలలో మరదలా! 52 వారాలా, 520 వారాలా? ఎందుకంటే ధరలపై గత ఏడాది ఆగస్టు 19 వ తేదీ సమావేశం తర్వాత మళ్ళీ ఇదే తెలుసా?

సుబ్బలష్షిమి:
ధరలు తగ్గినా తగ్గకపోయినా పత్రికలు తల్చుకుంటే ’తగ్గాయి తగ్గాయి’ అనిమాత్రం ఆపకుండా అంటాయి. కొన్ని పత్రికలైతే అప్పుడే ధరలు తగ్గాయని వ్రాయటం మొదలు పెట్టాయి బావా!

Sunday, February 7, 2010

నాటి హైదరాబాద్ రాష్ట్ర విముక్తే మా లక్ష్యం!

[నాటి హైదరాబాద్ రాష్ట్రవిముక్తి తమ అజెండాలో ఉందంటూ... ముంబయి29/11 దాడుల సూత్రధారిగా భావిస్తున్న జమాతుద్ దవా అధినేత హఫీజ్ సయీద్ భారత్ ను హెచ్చరించాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన అతడు లాహోర్ లో ’కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం’ సందర్భంగా సుమారు 10వేల మంది పాల్గొన్న ఒక సమావేశంలో ప్రకటించిన వార్త నేపధ్యంలో.]

సుబ్బలష్షిమి:
బావా! హైదరాబాద్ రాష్ట్ర విముక్తే తమ లక్ష్యమని లాహోర్ లో ప్రకటించారు. చూశావా?

సుబ్బారావు:
అందుకే గదా మరదలా, దేశంలో ఎక్కడ ఏ టెర్రరిస్టు చర్య జరిగినా మూలాలు హైదరాబాద్ లోనే తేలుతున్నాయి! కేసీఆర్ లు ’మా నిజాం మాకు గొప్ప’ అంటున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుందని. వేర్పాటువాదం వెనక మీడియా మద్దతు చూసినా ఇదే కన్పిస్తోంది.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! పుట్టలోని పాము ఒక్కొక్కటే బయటికొచ్చినట్లు, ఒక్కో విషయమే వెలుగు చూస్తే కదా అర్ధమయ్యేది!

Saturday, February 6, 2010

ప్రభావశీల మహిళ యూపీఏ కుర్చీవ్యక్తి సోనియాకి ఏ అవార్డు ఇవ్వాలి?

[బ్యాంకును మోసం చేసిన NRI శంత్ సింగ్ చత్వాల్ కు పద్మభూషన్ అవార్డు, కాశ్మీర్ మాజీ మిలిటెంట్ కు పద్మశ్రీ అవార్డు వచ్చిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న పద్మభూషణ్ అవార్డు పొందిన శంత్ సింగ్ చత్వాల్ కు, బ్యాంకును మోసం చేసిన కెరీరే గాక అణుఒప్పందం విషయమై అమెరికాలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తరుపున లైజాన్ గా పని చేసిన కెరీర్ కూడా ఉందట బావా! మరో మాజీ మిలిటెంట్ కి కూడా పద్మశ్రీ వచ్చిందట తెలుసా?

సుబ్బారావు:
నిజానికి అలాంటి వాళ్ళకు అవార్డు లిచ్చిన ప్రభుత్వాధినేతలకు, వాళ్ళందరిని నడిపే అన్నీతెలిసిన ప్రభావశీల మహిళ యూపీఏ కుర్చీవ్యక్తి సోనియాకి ఏ అవార్డు ఇవ్వాలి మరదలా?

సుబ్బలష్షిమి:
నోబల్ అవార్డు ఇవ్వాలి బావా! మొన్న బరాక్ ఒబామాకి ఇచ్చారు కదా?

హిందూమతాన్ని భ్రష్టుపట్టించడానికి దేవాదాయ శాఖనూ, TTDనీ మించిన వాళ్ళెవ్వరూ లేరు!

[హిందూమత ప్రచారంలో భాగంగా, కదిలే దేవాలయాలను రూపొందించి త్వరలో భక్తుల చెంతకు తీసుకు వెళ్ళనున్నట్లు TTD ఈవో కృష్ణారావు చెప్పారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒకప్పుడు కొండ కొనల మీద దేవాలయాలుండేవి. భక్తులు ఎంతో శ్రమకోర్చి పైకి ఎక్కి దైవదర్శనం చేసుకునేవాళ్లు.ఇప్పుడు TTD వాళ్ళు దేవుణ్ణి/దేవాలయాలని ఇల్లిల్లు తిప్పేటట్లున్నారు.

సుబ్బారావు:
ఇల్లిల్లు తిరగటానికి తిరుపతి దేవుడేమైనా తిరిపెమెత్తే వాడా? ఏమైనా హిందూమతాన్ని భ్రష్టుపట్టించడానికి దేవాదాయ శాఖనూ, TTDనీ మించిన వాళ్ళెవ్వరూ లేరు మరదలా!