[ఈనాడు వార్త: [26 Feb. 2010]
>>>తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇస్తూ రెండు టీవీ ఛానెళ్ళ అధినేతలపై చేసిన వ్యక్తిగత విమర్శలను ఉపసంహరించుకుంటున్నానని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు అమర్, మరోనేత అమరనాధ్ తో కలిసి గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పాత్రికేయుల సంఘం పెద్దలు చేసిన సూచన మేరకు వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటున్నానని కృష్ణమోహన్ పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి వార్త: [24 Feb.2010]
>>>టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ రెండో వివాహం చేసుకున్నారని, ఎన్‌టీవీ అధినేత నరేంద్ర మొదటి భార్యను చంపారని కృష్ణమోహన్ ఆరోపించారు. వారు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నారు. 2003 నుంచి రవిప్రకాశ్ సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అలాగే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేంద్ర చేసిన అక్రమాలు, 300-400 ఎకరాల్లో దామాషా ప్రకారం 40% గ్రీన్‌బెల్ట్ ఉంచారా లేదా, తదితరాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రవిప్రకాశ్ దక్షిణాఫ్రికాలో 7 చానళ్లు పెట్టారని, దుబాయ్‌లో ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.
కారు డ్రైవర్‌గా జీవితం ఆరంభించిన నరేంద్ర చానెల్ అధిపతి అయ్యారని, వందల కోట్లు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. - పై వార్తల నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆక్రమాల గురించి టీవీ9, NTV వాళ్ళు వార్తప్రసారాలు చేసారట. ఆ మీదట ఇతడు ఆ టీవీ అధినేతల అక్రమాలు, అనైతికతల గురించి ఆరోఫణలు చేశాడు. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుంటున్నానంటున్నాడు. అదీ పాత్రికేయుల పెద్దల సూచనల మేరకట.
సుబ్బారావు:
అంతే మరదలా! పాత్రికేయుల పెద్దల సూచనల మేరకు ఈ ఎమ్మెల్యే తన ఆరోపణలు ఉపసంహరించుకుంటాడు. రాజకీయ పెద్దల సూచనల మేరకు, ఆ టీవీ అధినేతలు ప్రసారాలు ఉపసంహరించుకుంటారు. దొంగలూ దొంగలూ బాహాటంగా ఊళ్ళు పంచుకుంటున్నారు. అంతే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment