Saturday, February 6, 2010

హిందూమతాన్ని భ్రష్టుపట్టించడానికి దేవాదాయ శాఖనూ, TTDనీ మించిన వాళ్ళెవ్వరూ లేరు!

[హిందూమత ప్రచారంలో భాగంగా, కదిలే దేవాలయాలను రూపొందించి త్వరలో భక్తుల చెంతకు తీసుకు వెళ్ళనున్నట్లు TTD ఈవో కృష్ణారావు చెప్పారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒకప్పుడు కొండ కొనల మీద దేవాలయాలుండేవి. భక్తులు ఎంతో శ్రమకోర్చి పైకి ఎక్కి దైవదర్శనం చేసుకునేవాళ్లు.ఇప్పుడు TTD వాళ్ళు దేవుణ్ణి/దేవాలయాలని ఇల్లిల్లు తిప్పేటట్లున్నారు.

సుబ్బారావు:
ఇల్లిల్లు తిరగటానికి తిరుపతి దేవుడేమైనా తిరిపెమెత్తే వాడా? ఏమైనా హిందూమతాన్ని భ్రష్టుపట్టించడానికి దేవాదాయ శాఖనూ, TTDనీ మించిన వాళ్ళెవ్వరూ లేరు మరదలా!

5 comments:

  1. ఆదిలక్ష్మి / అమ్మఒడి/ సోదరి గారూ :)

    హిందూ మతం అంటే ఏది? దీనికి ఈ పేరెలా వచ్చింది ? మీదగ్గర ఏమైనా వివరాలుంటే దయచేసి ఒక టపా వ్రాస్తారా?

    ReplyDelete
  2. టపాకాయ!

    బాగానే పేల్చారండోయ్!

    :)

    ReplyDelete
  3. భాస్కర రామిరెడ్డి : సంభోదనకి ఇన్ని విశేషణాలా? :)
    ఇప్పుడు మీరు అడిగిన టపా, ఇంతకు ముందు నేను మీకు బాకీ ఉన్న ’యూరప్ సాంకేతికంగా అభివృద్ది చెందటానికి, ఉపనిషత్తులకి మధ్య ఉన్న సంబంధం’ గురించిన టపాలు మరెప్పుడయినా!

    ఏకలవ్య: నెనర్లండి. :)

    ReplyDelete
  4. నుదుట బొట్టు పెట్టని దేవాదాయశాఖ మంత్రి ఏలుబడిలో జరుగుతూ ఉండేది,జరగబోయేది అదే కదా!

    ReplyDelete
  5. దేవుణ్ణి మోసెయ్యడమంటే ఇదే!
    బాగా చెప్పారు

    ReplyDelete