Saturday, February 13, 2010

ఓ వైపు ఆర్పేస్తూ - మరో వైపు ఆరనీయ వద్దని నీతులు!

[ఆదర్శ జ్యాలను ఆరనీయకండి - రామోజీరావు పిలుపు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సమాజానికి మంచి చేయాలనే ఆదర్శంతో పోలీసు శాఖలో చేరి ఇక్కడ శిక్షణ పొందుతున్న యువకులు ఆ ఆదర్శజ్వాలను ఆరనీయకుండా చూడాలని ఈనాడు రామోజీరావు పిలుపునిచ్చాడు, తెలుసా?

సుబ్బారావు:
పాపం! సమాజానికి మంచిచేయాలనే ఆదర్శంతోనే యువకులు మీడియా రంగంలోకీ వస్తారు కదా! వాళ్ల ఆదర్శజ్వాలను ఆర్పేస్తున్నప్పుడు, అసలు జ్వాలనే రగలనీయకుండా అణిచేస్తున్నప్పుడు ఈ నీతులన్నీ గుర్తుకు రాలేదేమో ఈ గురివిందగింజకి?

సుబ్బలష్షిమి:
భలేవాడివి బావా! ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు కాని, తాము ఆచరించేందుకు కాదని వాళ్ళెప్పుడో ఫిక్సయి పోయారు.

1 comment:

  1. ఈవార్తను చూసినప్పుడే దీనిపై టపాసు పేలుద్దని ఊహించా (తప్పుగా అనుకోవద్దు.) దెయ్యాలు-వేదాలు. ఏమంటారు?

    ReplyDelete