Sunday, February 28, 2010

ముస్లిం మనోభావాలని కించపరిస్తే అరెస్టులు - హిందూ మనోభావాలని కించపరిస్తే అవార్డులు

[>>>ఖురాన్ ను ఉద్దేశించి ఖమ్మం జిల్లాలో ఓ హేతువాది రాసిన పుస్తకంపై ఎంఐఎం ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను తిరస్కరించగా వారంతా నిరసన తెలిపారు. ముస్లింల మనోభావాలను గాయపరుస్తూ పుస్తకం రాసిన వ్యక్తిని అరెస్టు చేశామని, ఆ వ్యవహారం వెనక ఎవరున్నదీ విచారణ జరుగుతోందని సీఎం హామీ ఇవ్వడంతో మజ్లిస్ శాంతించింది. - ఈనాడు వార్త.

ఎం.ఎఫ్.హుస్సేన్ విషయంలో:
>>>దానిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందిస్తూ.. స్వదేశంలోకి రావడాన్ని వ్యతిరేకించబోమని, అయితే క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. హుస్సేన్ భారత్‌కు తిరిగి వస్తే పూర్తి స్థాయి భద్రత కల్పి స్తామని కాంగ్రెస్ పేర్కొంది. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఖురాన్ ని కించపరిచేటట్లు హేతువాద రచయిత, ఇన్నయ్య కాబోలు, ఏదో పుస్తకం వ్రాసాడట. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు గొడవ చేశారు. సదరు రచయితని అరెస్టు చేశామని సీఎం చెప్పాడు. మరీ... దశాబ్దాలుగా, హిందూ మత గ్రంధాలని కించపరుస్తూ విషవృక్షాలని వ్రాసిన రంగనాయకమ్మల దగ్గరి నుండీ, ఇటీవల ’ద్రౌపది’ వ్రాసిన యార్లగడ్డ ల వరకూ ఎవరినీ ఏమీ చెయ్యలేదేం బావా? ఏ భాజపా వాళ్ళూ అసెంబ్లీల్లో గానీ, పార్లమెంటులో గానీ, ఏ గొడవా చేయలేదుగా?

సుబ్బారావు:
గొడవ సంగతి దేవుడెరుగు మరదలా! ఏకంగా యార్లగడ్డకైతే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు సైతం ఇచ్చారు. దీన్ని బట్టి తెలియటం లేదా... ముస్లింలకి ఎం.ఐ.ఎం. అండ ఎంతో, భాజపా, కాంగ్రెస్ ల అండ కూడా అంతేనని!

6 comments:

  1. అంతేనండీ హిందువులను సొంత దేశంలోనే పరాయివాల్లను చేస్తున్న మన పాలకుల్లాంటి పనికిమాలిన పాలకులను ప్రపంచంలో మరెక్కడా చూడం - ఇది మన దౌర్భాగ్యం

    ReplyDelete
  2. నిజం చెప్పారండీ!ఈ దేశంలో హిందువులకి వ్యతిరేకంగా ఏమి రాసినా ఎవరూ ఏమీ మాట్లాడరు.పైగా సెచులర్ శిఖామణి అని బిరుదులూ అవార్డులూ గట్రా ఇస్తారు.ఆదే ముస్లింలకి వ్యతిరేకంగా పన్నెత్తు మాటన్నా కూడా ప్రపంచం మునిగి పోయినంత గొడవ చేస్తారు.వోటు బ్యాంకా మజాకా!

    ReplyDelete
  3. శభాష్!! యదార్థం ఇది. లౌకికవాదులమని చెప్పుకునేవాళ్ళు ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం ఇవ్వరు.

    ReplyDelete
  4. ఇంతటి దారిద్రమైన స్థితి లో మనం బతుకుతున్నాం, ఎన్నో సినిమా ల లో మన చరిత్ర ని కించపరిచే లా సీన్ లు కూడా వస్తున్నా సెన్సర్ బోర్డు ఎం చేస్తోందో అర్థం కావటం లేదు. పైగా ఈ మధ్య కొంత మంది రచయితలు అవార్డు లే పరమావధి గా సెక్స్ సాహిత్యం గుప్పిస్తున్నారు ఇద్ చాలా శోచనీయం.
    ---తెలంగాణా వాది

    ReplyDelete
  5. మనకి కుహనా లౌకికవాదులు నాయకులుగా ఉన్నంతకాలం ఇది తప్పదు.

    ReplyDelete
  6. http://nrahamthulla1.blogspot.com/2010/05/blog-post_18.html చూడండి.

    ReplyDelete