Monday, February 22, 2010

సంతకాలు చేస్తే ధరలు తగ్గుతాయా?

[అధిక ధరల మీద అందోళన చేయడానికి భాజపా సంతకాల సేకరణ చేస్తుంది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అధికధరల మీద భాజపా సంతకాలు సేకరించి ఆందోళన చేస్తుందట. సంతకాలు సేకరిస్తే ధరలు తగ్గుతాయా?

సుబ్బారావు:
ఒకప్పుడు అలాంటి మూవ్ మెంట్స్ ప్రభుత్వాలని కదిలించేవి మరదలా! ఇప్పటి ప్రభుత్వాలకవి దున్నపోతుమీద కురిసిన వర్షాల్లాంటివి.

సుబ్బలష్షిమి:
నిజంగా సంతకాలు పెడితే ధరలు తగ్గేటట్లయితే జనాలంతా వందలూ వేలూ సంతకాలు పెట్టకపోదూరా?

2 comments:

  1. బాగా చెప్పారు... దున్నపోతుల్లా, బండరాయిల్లా పడివుండటం ఈనాటి నేతలకు వెన్నెతో పెట్టిన విద్య. చీమకుట్టినట్టయినా కాకపోవడం తిన్నదరగక వచ్చిన బలుపుకు పరాకాష్టం.

    అందుకే నక్సలైట్లు, మావోలు, తీవ్రవాదులు పుట్టుకొచ్చేది...

    ఇలాంటి నాయకులతో పోలిస్తే కసబ్ లాంటి కౄర హంతకులెంతో మిన్న. వాడు చేసిన పాపం అందరికీ కనబడుతుంది - ఈ చెత్త నాయకులాడే వికృత నేరం కనబడదు.

    ReplyDelete
  2. సంతకాలు సేకరించటం. కొవ్వొత్తులు వెలిగించడము. ఇయ్యన్నీ టైమ్ పాస్ చేసేదానికి బాగుంటాయి.

    ReplyDelete